×
Ad

Covid Vaccine : వ్యాక్సిన్ వేయించుకోవటంలో నిర్లక్ష్యం వద్దు : డీహెచ్ శ్రీనివాస‌రావు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతం చేసేందుకు వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేశామని ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

  • Published On : March 16, 2022 / 12:14 PM IST

Dh G Srinivasa Rao

Covid Vaccine :  రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతం చేసేందుకు వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేశామని ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు ఆయన10టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ…ఇప్పటికే 60 ఏళ్ల నిండిన వారికి మొదటి, రెండు డోసులు వ్యాక్సిన్ వేయటం దాదాపుగా పూర్తయ్యిందని తెలిపారు. 18 ఏళ్ల వయస్సులోపు వారికి కూడా వ్యాక్సిన్ వేయటం కూడా పూర్తి కావచ్చిందని ఆయన తెలిపారు.

ఈరోజు నుంచి రాష్ట్రంలో 12 నుంచి 14 ఏళ్ల లోపు వయస్సు వారికి వ్యాక్సిన్ వేస్తున్నామని శ్రీనివాస రావు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రైమరీ, అర్బన్ హెల్త్ సెంటర్ ల లో ఈ వయసు పిల్లలకు వ్యాక్సినేషన్  ప్రక్రియ కొనసాగుతోందని ఆయన అన్నారు.
Also Read : Hanamkonda : అనుమానాస్పద స్ధితిలో గర్భిణి మృతి
వీరికి హైదరాబాద్ లోని బయాలజికల్ ఈ సంస్థ రూపొందించిన కొర్బివ్యాక్స్  అందిస్తున్నామని తెలిపారు. వ్యాక్సినే వేయించుకోవటంలో నిర్లక్ష్యం వహించవద్దని శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.