డిఫరెంట్ విలేజ్ : సగం గ్రామానికే ఎన్నికలు 

ఆ ఊర్లో సగం గ్రామానికే సర్పంచ్ ఎన్నికలు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో త్వరలో పంచాయితీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఓ గ్రామంలో సగం వరకే ఎన్నికలు జరగనున్నాయి.

  • Publish Date - January 8, 2019 / 09:59 AM IST

ఆ ఊర్లో సగం గ్రామానికే సర్పంచ్ ఎన్నికలు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో త్వరలో పంచాయితీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఓ గ్రామంలో సగం వరకే ఎన్నికలు జరగనున్నాయి.

పెద్దపల్లి : తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో త్వరలో పంచాయితీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఓ గ్రామంలో సగం వరకే ఎన్నికలు జరగనున్నాయి. ఇది వినటానికి విచిత్రంగా వుంది. కానీ ఇది నిజమేనండోయ్. పెద్దపల్లి జిల్లా గొల్లపల్లి గ్రామంలో ఈ సారి పంచాయతీ ఎన్నికలు సగం గ్రామానికే జరగనుండటం చర్చనీయాంశంగా మారింది. గొల్లపల్లి రెండు పంచాయతీలకు అనుబంధంగా ఉండటమే దీనికి కారణం. 

గొల్లపల్లి గ్రామంలో కేవలం 415 మంది మాత్రమే వున్నారు. గ్రామం మధ్యలో ఉన్న సీసీ రోడ్డుకు ఉత్తరం వైపు రాఘవాపూర్ పంచాయతీ పరిధిలో ఉండగా..దక్షిణ వైపు బంధంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. బంధంపల్లి పంచాయతీని పెద్దపల్లి మున్సిపాలిటీలో విలీనం చేయనుండటంతో అక్కడ స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో దీని అనుబంధ గ్రామమైన గొల్లపల్లిలో సగం గ్రామానికే పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. 
 
ట్రెండింగ్ వార్తలు