Disha Encounter Case : దిశా ఎన్‌కౌంటర్‌.. పోలీసులకు బిగ్ రిలీఫ్..!

దిశా నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది కమిషన్. అయితే, సిర్పూర్ కమిషన్ నివేదిక..

Disha Encounter Case : దిశా నిందితుల ఎన్ కౌంటర్ కేసులో పోలీసు అధికారులకు హైకోర్టులో ఊరట లభించింది. సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారులపై చర్యలు తీసుకోవద్దని చెప్పింది.

సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై హైకోర్టును ఆశ్రయించారు ఏడుగురు పోలీసు అధికారులు, షాద్ నగర్ తహసిల్దార్. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. వాళ్ళపై చర్యలు తీసుకోవద్దంటూ స్టే విధించారు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి.

దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై సిర్పూర్ కర్ కమిషన్ ను సుప్రీంకోర్టు నియమించిన సంగతి తెలిసిందే. క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు పలువురిని విచారించింది సిర్పూర్ కమిషన్. దిశా నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది కమిషన్. అయితే, సిర్పూర్ కమిషన్ నివేదిక సరిగ్గా లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీస్ అధికారులు. సిర్పూర్ కమిషన్ నివేదికపై హైకోర్టు సింగిల్ బెంచ్ ను ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై విజయసేన్ రెడ్డి బెంజ్ స్టే విధించింది. దీంతో పోలీసు అధికారులకు రిలీఫ్ దక్కింది.

 

ట్రెండింగ్ వార్తలు