×
Ad

Diwali 2025 : దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలి.. 20వ తేదీనా.. 21వ తేదీనా..? ప్రభుత్వం సెలవు ఎప్పుడు.. పండితులు ఏం చెబుతున్నారంటే?

Diwali 2025 : దీపావళి ప్రధాన హిందూ పండుగల్లో ఒకటి. ఈ పండుగను దేశమంతటా ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకుంటారు. అయితే,

Diwali 2025

Diwali 2025 : దీపావళి ప్రధాన హిందూ పండుగల్లో ఒకటి. ఈ పండుగను దేశమంతటా ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకుంటారు. అయితే, ఈ ఏడాది దీపావళి పండుగను ఏరోజు జరుపుకోవాలనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

హిందూ క్యాలెండర్ ప్రకారం.. దీపావళి పండుగ అమావాస్య తిథి అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 4.05 గంటల దాకా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలా రెండు రోజుల్లో వ్యాపించి ఉండడంతో పండుగ ఏ రోజు జరుపుకోవాలనేదానిపై అందరిలో సందేహం నెలకొంది. అయితే, 2025 సంవత్సరంలో ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ ప్రకారం.. ఇప్పటికే ఇచ్చిన జీవోలో ఉన్న జాబితా ప్రకారం దీపావళి పండుగ ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీనే. కానీ, క్యాలెండర్లలో సూర్యోదయ సమయానికి 21వ తేదీన అమావాస్య కనిపిస్తుండడంతో చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు.

Also Read: Astrology : దీపావళి రోజు నుంచి ఈ రాశుల వారిదే లక్కంతా.. పట్టిందల్లా బంగారమే.. ఇలా ఎందుకో తెలుసా.. ఆ యోగం కారణంగానే..

దీపావళి అనగానే అందరికీ గుర్తొచ్చేది ధనలక్ష్మీ పూజ. కేదార వ్రతం. పండితులు చెబుతున్న దాని ప్రకారం సూర్యాస్తమయంలో అమావాస్య తిథి వ్యాప్తి ఉన్నప్పుడు ధనలక్ష్మీ పూజ చేసుకుని పండుగ జరుపుతుంటారు. కొన్ని చోట్ల సూర్యోదయ సమయంలో కేదార వ్రతం చేసుకున్న తరువాత నుంచి పండుగగా పరిగణిస్తారు. ఇలా రకరకాల అభిప్రాయాలు, ఆనవాయితీలు ఉండడంతో దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలాఉంటే.. పలువురు పండితులు మాత్రం దీపావళిని 20వ తేదీనే జరుపుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే.. దీపావళి పండుగకు అమవాస్య ప్రధానం. అమవాస్య తిథి 20వ తేదీన రాత్రి మొత్తం ఉంటుంది. 21వ తేదీ సాయంత్రానికి పాడ్యమి వచ్చేస్తుంది. 21వ తేదీ అమవాస్య ఉండదు కాబట్టి.. 20వ తేదీనే దీపావళి జరుపుకోవాలని చెబుతున్నారు. తెలంగాణ విద్వత్ సభ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం .. దీపావళి అక్టోబర్ 20వ తేదీన, 21వ తేదీన కేదార వ్రతం జరుపుకోవాలని ఉంది. దీపావళి రోజున లక్ష్మీపూజ చేయడం వల్ల ధన దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.