Telangana Polls: కౌంటింగ్‭కి ముందు వ్యూహం మార్చిన కాంగ్రెస్ అధిష్టానం

ఇంతకు ముందు హైదరాబాద్ రావాలని చెప్పిన అభ్యర్థులను కూడా రావద్దని తాజా ఆదేశాల్లో తేల్చి చెప్పింది. రాత్రి 11:30కు హైదరాబాద్ కి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రానున్నారు. తాజ్ కృష్ణా హోటల్లో రాత్రి బస చేయనున్నారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగుకు సమయం సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంది. కౌంటింగ్ ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రాలు దాటి ఎవరూ బయటికి రావద్దని అభ్యర్థులకు ఏఐసీసీ శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఏఐసీసీ పరిశీలకులు కూడా కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్దనే ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది.

అంతే కాకుండా.. ఇంతకు ముందు హైదరాబాద్ రావాలని చెప్పిన అభ్యర్థులను కూడా రావద్దని తాజా ఆదేశాల్లో తేల్చి చెప్పింది. రాత్రి 11:30కు హైదరాబాద్ కి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రానున్నారు. తాజ్ కృష్ణా హోటల్లో రాత్రి బస చేయనున్నారు. రేపు తాజ్ కృష్ణా నుంచి బయల్దేరి రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించనున్నారు. అలాగే మరికొంత మంది నేతలు రేపు ఉదయం రాష్ట్రానికి రానున్నారు.