red mercury in old tv and radios: మీ దగ్గర పాత కాలం నాటి టీవీలు, రేడియోలు ఉన్నాయా..అయితే మీరు లక్షాధికారి..అదృష్టం బాగుంటే కోటీశ్వరుడు కూడా అయినట్లే. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో జోరుగా జరుగుతున్న ప్రచారం ఇది. ఇటు కోనేందుకు ముఠాలు..అటు అమ్మేందుకు జనాలు..ఈ టీవీలు, రేడియోల వేటలో ఫుల్ బిజీ అయిపోయారు. మరి నిజంగానే ఇది కోట్లు కురిపించే అవకాశమా..? లేదంటే కొత్త తరహా మోసమా..?
తెలుగు రాష్ట్రాల్లో పాత టీవీలు, రేడియోలకు ఫుల్ డిమాండ్:
తెలుగు రాష్ట్రాల్లో పాత టీవీలు, రేడియోల వేట.. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన డిమాండ్.. పల్లెలు, పట్టణాలను జల్లెడ పట్టేస్తున్న ముఠాలు.. లక్షలు, కోట్లు సైతం ఇచ్చి కొనడానికి సిద్ధం.. మరి నిజంగానే…పాత టీవీలు, రేడియోలుంటే లక్షాధికారి అయినట్లేనా! ఇన్నాళ్లు లేని డిమాండ్ వాటికి ఇప్పుడెలా వచ్చింది? అంతర్రాష్ట్ర ముఠాలే ఎందుకు ఆఫర్లు కురిపిస్తున్నాయి? కొత్త తరహా మోసమా? కోట్లు కురిపించే అవకాశమా? ఇంతకీ ఏమిటీ బేరం?
5 గ్రాముల ఫిలమెంట్‌కు రూ.5కోట్లు, 10 గ్రాములు ఉంటే రూ.10 కోట్ల:
రెడ్ మెర్క్యురీ…ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఎర్రటి పాదరసం. ఐదారు దశాబ్దాల కిందటి టీవీలు, రేడియోల్లో ఈ రెడ్ మెర్క్యురీ ఫిలమెంట్‌ను వాడేవారు. ఇప్పుడు ఈ రెడ్ మెర్క్యురీకి అమాంతం డిమాండ్ పెరిగిపోయింది. అదేదో..వందలు..వేలల్లో కాదు..ఏకంగా లక్షలు, కోట్ల రూపాయల్లో. ఇప్పుడు పలుకుతున్న ధర ఎంతో తెలిస్తే ఎవరైన అవాక్కవాల్సిందే. ఐదు గ్రాముల ఫిలమెంట్‌కు ఐదు కోట్ల రూపాయలు..10 గ్రాములు ఉంటే 10 కోట్ల రూపాయలు ఇస్తామంటూ…ముందుకొస్తున్నాయి కొన్నిఅంతర్రాష్ట్ర ముఠాలు.
20, 30ఏళ్ల కిందటి టీవీలు, రేడియోలు ఇస్తే.. లక్షలు, కోట్లు ఇస్తామని:
లాక్‌డౌన్ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ..మార్కెట్‌లో సడన్‌గా పాత టీవీలు, రేడియోలకు డిమాండ్ పెరిగిపోయింది. అంతకుముందు..వేయి, వంద కూడా పలకని పాత టీవీలు.. ఇప్పుడు ఏకంగా లక్షలు, కోట్లు పలుకుతున్నాయి. 20, 30 ఏళ్ల కిందటి టీవీలు, రేడియోలు ఇస్తే..లక్షలు, కోట్లు ఇస్తామని..కొన్ని ముఠాలు బంపరాఫర్లు ఇస్తున్నాయి. అయినా..పాత టీవీల్లో కొత్తగా ఇప్పుడేం కనిపించింది. ఇది కొత్త తరహా మోసమా..నిజంగానే కోట్లు కురిపించే అవకాశమా…? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
What is trending old TV on social media is rumoured or right
What use is the red mercury that’s going out inside the old TV pic.twitter.com/2fyOopHfh6— Chandra prakash (@Chandu5122) September 9, 2020
లక్షలు, కోట్లు ఇచ్చి మరీ కొనేందుకు రెడీ:
మీ దగ్గర పాత కాలం నాటి టీవీ ఉందా..ఆనాటి రేడియో ఉందా..టీవీ మెకానిక్‌లతో పాటు మిగతా జనాలకు ఎదురవుతున్న ప్రశ్నలివి. పాత టీవీలు, రేడియోలు ఇస్తే చాలు..లక్షలు, కోట్లు ఇచ్చి మరీ కొనేందుకు రెడీగా ఉన్నాయి కొన్ని ముఠాలు. పాత టీవీలు, రేడియోల్లో ఉన్న రెడ్ మెర్క్యూరీ ఫిలమెంట్ కోసమే ఈ ప్రయత్నాలు, బంపరాఫర్లు. నిజానికి.. దాని వల్ల ఉన్న ఉపయోగమేంటో..ఎవరికీ తెలియదు. కానీ దాని కోసమే అందరి అన్వేషణ. దాంతో ఎలాంటి ఉపయోగం లేదని టీవీ మెకానిక్‌లు చెబుతున్నా…వినిపించుకోకుండా కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఎంత డబ్బైనా..ఇస్తామంటూ వేట ముమ్మరం చేస్తున్నారు.
गेले पाच सहा दिवसांपासून सात ते आठ माझ्या संपर्कातील काही मित्रांचे कॉल आले आणि जुनी टीव्ही / रेडिओ टेलिफोन असेल तर द्या पाहिजे ती किंमत देऊ.
अशी मागणी झाली.पाहिले काही दिवस मी टाळले. आता फेसबुक आणि व्हॉटसअप सुद्धा मेसेज येऊ लागले. #RedMercury pic.twitter.com/elkf2GmPqW
— Dattatraya Raut (@DattaRaut) September 14, 2020
అంతా మెర్క్యూరీ మాయలో పడిపోయారు:
ఈ రెడ్ మెర్క్యూరీ ఫిలమెంట్ గురించి..సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో..పబ్లిక్ అంతా ఈ మెర్క్యూరీ మాయలో పడిపోయారు. కొన్ని ముఠాలు..తమ దగ్గర ఉందంటే..తమ దగ్గర ఉందని ప్రచారం చేస్తూ మోసాలకు దిగుతున్నాయి. ఈ పాత టీవీలు, రేడియోల కోసం మెకానిక్ షాప్‌ల చుట్టే కాదు..ఆన్‌లైన్‌లోనూ తెగ వెతికేస్తున్నారు. కొన్ని వెబ్‌సైట్లలో వాటి ధరలు చూస్తే.. దిమ్మతిరుగుతోంది. కొందరేమో..పాత టీవీలు, రేడియోలు కావాలంటూ యాడ్స్ ఇస్తుంటే…ఇంకొందరేమా..మీకు కావాల్సిన పాత టీవీలు మా దగ్గరున్నాయంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పాత టీవీలు, రేడియోల వేట:
చదువుకోని వాళ్లు..అమాయక జనాలు…అలా వెతుకుతున్నారంటే ఓ అర్థం ఉంటుంది. కానీ..అన్నీ తెలిసిన విద్యావంతులు సైతం ఆనాటి పాత టీవీలు, వీడియోల కోసం విస్తృతంగా వెతుకుతున్నారు. ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ముఠాలు..ఈ టీవీలు, రేడియోల కోసం తెలుగు రాష్ట్రాల్లో తెగ వెతికేస్తున్నాయి. లక్షలు, కోట్లు వస్తాయనే ఆశతో..ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆ వేటలో పడ్డారు. ఇందుకు సంబంధించి పలు చోట్ల భారీగా రహస్య లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.