Doctor Preethi: ప్రీతి సోదరికి ఉద్యోగం.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.

Preethi

Telangana: వరంగల్ (Warangal) కేఎంసీలో సీనియర్ వేధింపుల కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డ డాక్టర్ ప్రీతి (Doctor Preethi) కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం బాసటగా నిలిచింది. డాక్టర్ ప్రీతి సోదరి పూజకి హెచ్ఎండీఏలో కాంట్రాక్ట్ బేసిస్ లో ఉద్యోగం కల్పించింది.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రీతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా చెప్పారు. ప్రీతి తల్లిదండ్రులకు కవిత కొన్ని రోజుల క్రితం ఓ లేఖ కూడా రాశారు.

వారికి తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. కాగా, వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కొన్ని వారాల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రీతిని వైద్యం కోసం వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించినా లాభం లేకుండా పోయింది.

ఆమె ఆత్మహత్మకు కారణం సీనియర్ మెడికో సైఫ్ వేధింపులే కారణమని ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజకీయంగానూ ఎన్నో విమర్శలు వచ్చాయి. ప్రీతి మరణానికి కారణమైన దోషులను వదిలిపెట్టబోమని తెలంగాణ మంత్రులు చెప్పారు.

Konda Vishweshwar Reddy : కవితను అరెస్ట్ చేయాలని ప్రజల్లో ఉంది, రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తాం- కొండా విశ్వేశ్వర్ రెడ్డి