Kottagudem
baby hand broke : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కొత్తగూడెం మాతా శిశు కేంద్రంలో డాక్టర్లు కాన్పు చేస్తూ శిశువు చెయ్యి విరిచారు. శిశువు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కొత్తగూడెం రామవరంలోని మాతా శిశు వైద్య శాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే.. కాన్పు కోసం వచ్చిన భువన అనే మహిళకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఆపరేషన్ సమయంలో బిడ్డను బయటకు తీసే క్రమంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శిశువు చేయి విరిగింది. ఈ తతంగమంతా సోమవారం రాత్రి జరిగినప్పటికీ వైద్యులు బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. విరిగిన బిడ్డ చేతికి కట్టు కట్టి తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేశారు. బాధిత బంధువులు కోపోద్రిక్తులవుతున్నారు.
Nalgonda : ఆపరేషన్ తర్వాత దూది, వేస్ట్‌క్లాత్‌ను మహిళ కడుపులోనే పెట్టి కుట్టేసిన డాక్టర్లు
ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సరళను సరైన వివరణ కోరగా జరిగిన విషయం తనకు కొద్ది సేపటి క్రితమే తెలిసిందని తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేశారు. బిడ్డ పరిస్థితి ఆందోళనగా ఉందన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.