TRUMP HARDCORE FAN KRISHNA DIES ట్రంప్ వీరాభిమాని కన్నుమూశాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నే తన దైవంగా భావించి ట్రంప్ విగ్రహానికి నిత్యం పూజలు చేసే తెలంణాకు చెందిన బుస్స కృష్ణ చనిపోయాడు. మెదక్ జిల్లా తూఫ్రాన్ లో గుండెపోటుతో ఇవాళ కృష్ణ కన్నుమూశాడు.
జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంకు చెందిన కృష్ణ… డొనాల్డ్ ట్రంప్‌కి వీరాభిమాని. ఇటీవల ట్రంప్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఆ రోజు నుంచి కృష్ణ నిద్రాహారాలు మాని కుమిలిపోయాడు. ట్రంప్ కరోనా నుంచి కోలుకున్నా ఈ అభిమాని మాత్రం కోలుకోలేకపోయాడు. ఈ క్రమంలో ట్రంప్ నామ జపం చేస్తూ కృష్ణ ప్రాణాలు వదిలాడు
ట్రంప్ కు కరోనా సోకినప్పటినుంచి కృష్ణ బాధలో ఉన్నాడు. ఆ బాధలోనే కృష్ణ గుండెపోటుతో మరణించినట్లు సన్నిహితులు చెబుతున్నారు. నాలుగు రోజులుగా కృష్ణ..నిద్రాహారాలు కూడా మానేసి అనారోగ్యానికి గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ట్రంప్‌కి వీరాభిమాని అయిన కృష్ణ 2017 దీపావళిలో తన ఇంట్లో ట్రంప్ చిత్రపటానికి పూజలు చేస్తూ అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ తరువాత తన ఇంటి ప్రాంగణంలో ట్రంప్ గుడిని కట్టాడు. అందులో ట్రంప్ విగ్రహం ఉండగా.. దానికి రోజూ పూజలు, కొబ్బరికాయలు, ప్రసాదాలు పెట్టేవాడు. ఇక కృష్ణ గురించి ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. ‘వంద కోట్ల భారతీయుల్లో క్రిష్ నా ప్రాణస్నేహితుడు. క్రిష్ నా అభిమాని. అతను నా ఫొటోల ద్వారా గొప్పశక్తిని పొందాలని ప్రార్థిస్తున్నా. క్రిష్‌ను త్వరలోనే కలుస్తా అని కామెంట్ పెట్టిన విషయం తెలిసిందే.