Nagarkurnool Ticket Controversy
Nagarkurnool Ticket Controversy : తెలంగాణ బీజేపీలో జనసేన చిచ్చు కొనసాగుతోంది. పొత్తులో భాగంగా పలు సీట్లు జనసేనకు ఇస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం బీజేపీ నేతలకు కోపం తెప్పిస్తోంది. జనసేనకు టికెట్ చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. నాగర్ కర్నూల్ టికెట్ జనసేకు కేటాయిస్తే అంగీకరించేది లేదని ఆ నియోజకవర్గం బీజేపీ నేతలు అంటున్నారు. పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ టికెట్ జనసేనకు కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో నాగర్ కర్నూల్ బీజేపీ నేతలు అలర్ట్ అయ్యారు.
నాగర్ కర్నూల్ టికెట్ ను స్థానిక బీజేపీ నేత దిలీపాచారి ఆశిస్తున్నారు. కచ్చితంగా తనకే టికెట్ ఇస్తారని నమ్మకంగా ఉన్నారాయన. అయితే అనూహ్యంగా జనసేన ప్రస్తావన రాడంతో ఆయన అప్రమత్తం అయ్యారు. బీజేపీ కార్యాలయం ముందు దిలీపాచారి మద్దతుదారులు, బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. జనసేనకు నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వొద్దు అంటూ నినాదాలు చేశారు. జనసేన వద్దు, బీజేపీ ముద్దు అంటూ స్లోగన్స్ చేశారు.
Also Read : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల.. 35 మందికి చోటు
నాగర్ కర్నూల్ టికెట్ బీజేపీ నేత దిలీపాచారికి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దిలీపాచారి నాగర్ కర్నూల్ బీజేపీ నేత అని, జనసేన అసలు నాగర్ కర్నూల్ లో లేదని చెప్పారు. అలాంటి పార్టీని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. జనసేనను పోటీలో పెడితే వచ్చే లాభమేంటి? అని దిలీపాచారి నిలదీశారు. అసలు పార్టీలో ఏం జరుగుతోంది? అని ఆయన ప్రశ్నించారు.
”నల్లమట్టి అక్రమంగా రవాణ చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పై పోరాటం చేస్తున్నాం. మా ప్రాణాలకు తెగించి పోరాటాలు చేస్తున్నాం. మాపై ఎన్నో కేసులయ్యాయి. మాకు న్యాయం చేసే వరకు బీజేపీ పార్టీ ఆఫీస్ లోనే ఉంటాం. మాకు న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం. జనసేనకు టికెట్ ఇస్తే మా శ్రమ, కష్టం వృథా కావాలి. పెద్ద పెద్ద నాయకులు పోటీకి వెనకాడుతుంటే.. ధైర్యంగా పోటీ చేస్తామని ముందుకు వస్తుంటే మాకు ఎందుకు టికెట్ ఇవ్వడం లేదు? నాగర్ కర్నూల్ కు వచ్చి జేపీ నడ్డా బీజేపీని గెలిపించాలన్నారు. రాత్రి రాత్రికి జనసేన పార్టీని తీసుకొచ్చి మీరు భరించండి అంటే మేము భరించలేం. మా ఏకైక డిమాండ్ నాగర్ కర్నూల్ నియోజకవర్గం టికెట్ బీజేపీకి ఇవ్వాలి” అని దిలీపాచారి అన్నారు.
Also Read : టీడీపీ పోటీ నుంచి ఎందుకు విరమించుకుందో చెప్పాలి.. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు