Tealangana BJP : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల.. 35 మందికి చోటు

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మూడో విడత అభ్యర్థుల జాబితాను గురువారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ జాబితాలో 35మందికి టికెట్లు కేటాయించింది.

Tealangana BJP : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల.. 35 మందికి చోటు

Telangana BJP

Updated On : November 2, 2023 / 3:19 PM IST

Tealangana BJP Candidates 3rd List Release : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల జాబితాను బీజేపీ విడతల వారిగా విడుదల చేస్తుంది. ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ.. గురువారం మధ్యాహ్నం మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 35మందికి టికెట్లు కేటాయించింది. ఈ 35 నియోజకవర్గాల్లో ఒక మహిళకు మాత్రమే టికెట్ దక్కింది. బండారు దత్తాత్రేయ కుమార్తె కు టికెట్ దక్కలేదు. మరోవైపు బీజేపీ, జనసేన పోత్తులో భాగంగా కూకట్ పల్లి, శేరిలింగంపల్లి స్థానాలను బీజేపీ అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. ఈ రెండు స్థానాలకోసం జనసేన పట్టుబడుతుంది. జనసేనకు కేటాయించేందుకు ఈ రెండు స్థానాల్లో బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించలేదని తెలుస్తోంది. నాంపల్లి, కంటోన్మెంట్, మల్కాజ్ గిరి నియోజకవర్గాలను బీజేపీ అధిష్టానం పెడింగ్ లో పెట్టింది.

బీజేపీ ఇప్పటి వరకు మూడు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొదటి విడతలో 52 మందితో అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. రెండో విడతలో ఒక్కరి పేరుతో జాబితాను రిలీజ్ చేసింది. మూడో విడతలో 35 మందితో అబ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. మూడు విడతల్లో మొత్తం 88 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో బీసీలు 33, ఓసీలు 33, ఎస్సీ 13, ఎస్టీలకు 9 సీట్లను బీజేపీ అధిష్టానం కేటాయించింది.

అభ్యర్థులు వీరే..

మంచిర్యాల – వీరబెల్లి రఘునాథ్
ఆసిఫాబాద్ (ఎస్టీ) – అజ్మీరా అత్మారామ్ నాయక్
బోధన్ – వడ్డి మోహన్ రెడ్డి
బాన్సువాడ – యెండల లక్ష్మీనారాయణ
నిజామాబాద్ రూరల్ – దినేశ్ కులాచారి
మంథని – చందుపట్ల సునీల్ రెడ్డి
మెదక్ – పంజా విజయకుమారి
నారాయణఖేడ్ – జనవాడె సంగప్ప
ఆంధోల్ (ఎస్సీ) – బాబూ మోహన్
జహీరాబాద్ (ఎస్సీ) – రామచంద్ర రాజ నర్సింహ
ఉప్పల్ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ఎల్బీనగర్ – సామ రంగారెడ్డి
రాజేంద్రనగర్ – తోకల శ్రీనివాస్ రెడ్డి
చేవెళ్ల (ఎస్సీ) – కే.ఎస్. రత్నం
పరిగి – భూనేటి మారుతి కిరణ్
ముషీరాబాద్ – పూస రాజు
మలక్ పేట్ – శ్యామ్ రెడ్డి సురేందర్ రెడ్డి
అంబర్ పేట్ – కృష్ణా యాదవ్
జూబ్లీహిల్స్ – లంకల దీపక్ రెడ్డి

సనత్ నగర్ – మర్రి శశిధర్ రెడ్డి

సికింద్రాబాద్ – మేకల సారంగపాణి

నారాయణపేట్ – రతంగ్ పాండురెడ్డి
జడ్చర్ల – చిత్తరంజన్ దాస్
మక్తల్ – జలందర్ రెడ్డి
వనపర్తి – అశ్వత్థామరెడ్డి
అచ్చంపేట్ (ఎస్సీ) – దేవని సతీష్ మాదిగ
షాద్ నగర్ – అండె బాబయ్య
దేవరకొండ (ఎస్టీ) కేతావత్ లాలూనాయక్
హుజూర్ నగర్ – చల్ల శ్రీలతా రెడ్డి
నల్గొండ – మాదగాని శ్రీనివాస్ గౌడ్
ఆలేరు – పడాల శ్రీనివాస్
పరకాల – డాక్టర్ కాలి ప్రసాద్ రావు
పినపాక (ఎస్టీ) – పోడియం బాలరాజు
పాలేరు – నున్న రవికుమార్
సత్తుపల్లి (ఎస్సీ) – రామలింగేశ్వరరావు