ప్రతి నెల 4శాతం లాభం అంటూ రూ.300 కోట్లు కొట్టేసిన కేటుగాడు..

కస్టమర్లతో 8 లక్షలకు రెండు గుంటల భూమి కొనుగోలు చేయించాడు. ప్రతి నెల 4శాతం లాభం ఇస్తామంటూ ఒప్పందం చేసుకున్నాడు.

Double Gold Scheme Scam : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ మోసం బయటపడింది. బై బ్యాక్ పాలసీ స్కీమ్, డబుల్ గోల్డ్ స్కీమ్ పేరుతో భారీ స్కామ్ జరిగింది. 3వేల 600 మందిని మోసగించి.. 300 కోట్ల రూపాయలు కొట్టేశాడు కేటుగాడు. నిందితుడు పవన్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ కు సహకరించిన మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. డిపాజిటర్ల నుంచి పవన్ భారీ మొత్తంలో వసూలు చేసి మోసగించాడు. వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెట్టుబడిదారులను చీట్ చేశాడు. 25 నెలలకుగాను బై బ్యాక్ ఓపెన్ ప్లాట్స్ స్కీమ్ ను పవన్ ప్రారంభించాడు.

కస్టమర్లతో 8 లక్షలకు రెండు గుంటల భూమి కొనుగోలు చేయించాడు. ప్రతి నెల 4శాతం లాభం ఇస్తామంటూ ఒప్పందం చేసుకున్నాడు. కొన్ని నెలలు లాభాలు ఇచ్చాడు ఆ తర్వాత ముఖం చాటేశాడు. డబుల్ గోల్డ్ స్కీమ్, గోల్డ్ చెక్ స్కీమ్ కింద లక్షలు వసూలు చేశాడు. పెట్టుబడులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పవన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసిన భారీ మోసం కలకలం రేపుతోంది. సుమారు 3600 మందిని మోసగించి పవన్ అనే కేటుగాడు రూ.300 కోట్లు కొట్టేశాడు. బాధితుల ఫిర్యాదుతో పవన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించి మోసగించాడు. ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంక కదిలింది. ఇన్వెస్ట్ మెంట్ చేసిన వారికి తొలుత కొంత డబ్బులు చెల్లించారు. దాంతో వారిలో నమ్మకం కుదిర్చారు. పెట్టుబడులు పెట్టిన వారు చెప్పడంతో మరికొందరు ఇన్వెస్ట్ చేశారు. ఇలా 3600 మంది వరకు పెట్టుబడులు పెట్టారు. చివరికి కేటుగాడి మోసం బయటపడింది. తాము మోసపోయామని తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు.

కాగా, ఇలాంటి స్కామ్ ల గురించి పోలీసులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఊరికే ఏదీ రాదు అని చెబుతూనే ఉన్నారు. అధిక లాభాల ఆశతో మోసపోవద్దని, ఇలాంటి స్కామ్ ల గురించి అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ఫ్రాడ్ గురించి ప్రజలకు చైతన్యం కల్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయినా, ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. అధిక లాభాలకు ఆశపడి అడ్డంగా మోసపోతున్నారు.

Also Read : బాబోయ్.. భర్తతో కలిసి వెళ్తున్నా వదలడం లేదు.. ఏలూరులో కలకలం..