Drinking water
Hyderabad Drinking Water: హైదరాబాద్ నగర ప్రజలకు బిగ్ అలర్ట్.. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు తెలిపింది. జలమండలి పరిధిలోని లింగంపల్లి నుంచి సనత్ నగర్ రిజర్వాయర్ కు నీటిని సరఫరా చేసే పైపులైన్ జంక్షన్ పనుల కారణంగా నీటి సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు తాగునీటి సరఫరా ఉండదని చెప్పారు.
నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు:
కూకట్‌పల్లి డివిజన్ : రాజీవ్ గాంధీనగర్, ఎన్టీఆర్‌నగర్, శ్రీశ్రీనగర్, ప్రశాంత్‌నగర్, దీన్‌దయాళ్‌నగర్, జింకలవాడ, ప్రభాకర్‌రెడ్డినగర్, ఎల్‌బీఎస్‌నగర్, ఫతేనగర్, చరబండరాజు కాలనీ, సమతానగర్, వెంకటేశ్వరనగర్, కార్మికనగర్, శివశంకర్ నగర్, బాలానగర్, జనతానగర్, శాస్త్రిమార్గం, జిల్లాబస్తీ, శ్రీరామ్‌కాలనీ, చైతన్యబస్తీ, వడ్డెరబస్తీ, ఎరుకలబస్తీ, 15వ ఫేజ్‌లో హనుమాన్‌చౌక్, యాదవ్‌బస్తీ, హెచ్‌పీ రోడ్, కైత్లాపూర్, రాఘవేంద్రకాలనీ, భవానీనగర్, సర్దార్ పటేల్‌నగర్, జేపీ నగర్ ఈడబ్ల్యూఎస్, ఎంఐజీ, గూడ్సుషెడ్ రోడ్, హెచ్‌ఐజీ ఎల్‌ఐజీ కాలనీలు, సత్యసాయి నగర్.
ఎస్సార్‌నగర్ డివిజన్: డీఎన్‌ఎం కాలనీ, బీజేఆర్‌నగర్, రేణుకానగర్, సుప్రభాత్‌నగర్, నీమ్‌కర్‌నగర్. అశోక్ కాలనీ, అల్లావుద్దీన్‌కోటి ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.