మందుల కుంభకోణం 10టీవీ కథనాలతో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు

  • Publish Date - November 7, 2020 / 06:40 PM IST

Khairatabad Wellness Center : టెన్‌టీవీ ప్రసారం చేసిన హైదరాబాద్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో మందుల కుంభకోణంపై ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. టెన్‌ టీవీ వరుస కథనాలతో ఖైరతాబాద్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను డ్రగ్‌ కంట్రోలర్‌ డైరెక్టర్‌ ప్రీతి మీనన్‌ తనిఖీ చేశారు. దాదాపు గంటపాటు ఆమె తనిఖీ చేశారు.



కాలం చెల్లిన మందులపై ఆరా తీశారు. కాలం చెల్లిన మెడిసిన్స్ ఉన్నట్టు తన తనిఖీల్లో గుర్తించారు. వాటిని అక్కడి నుంచి తరలించేందుకు అధికారులు రెడీ సిద్ధమౌతున్నారు.



వెల్ నెస్ సెంటర్లలో కాలం చెల్లిన మందులు ఉన్నాయని డైరెక్టర్ ఒప్పుకున్నారు. వాటిని ఇక్కడి నుంచి తరలించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. 2018, 2019, 2020 సంవత్సరానికి కాలం చెల్లిన మందులు ఉన్నాయని తెలిపారు.



వెల్‌నెస్ సెంటర్ నుంచి కాలం చెల్లిన మందులను తరలిస్తున్న వ్యవహారం 10tv కెమెరాకు చిక్కింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధికారుల అనుమతి లేకుండానే రాత్రి పూట మందులను ఎందుకు తీసుకెళ్తున్నారనే విషయంపై 10tv కూపీ లాగింది. ఆ మందులన్నీ ఇతల జిల్లాల్లోని వెల్‌నెస్ సెంటర్లకు చేరాల్సిన మందులుగా తేలింది.



అయితే.. ఇతర జిల్లాలకు పంపించాల్సిన మందులను కూడా.. ఖైరతాబాద్ వెల్‌నెస్ సెంటర్‌లో ఎందుకు ఉంచాల్సి వచ్చింది. ఇవే ప్రశ్నలను 10tv లేవనెత్తుతోంది. అంటే ఇతర జిల్లాల్లోని వెల్‌నెస్ సెంటర్లకు వెళ్లే వారికి మందులు ఇవ్వడం లేదా.. ఒక వేళ మందులను బయట తెచ్చుకోవాలని రాసి చేతులు దులుపుకుంటున్నారా..అనేది తేలాల్సి ఉంది. వెల్‌నెస్ సెంటర్లు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సంస్థ భారీగా అక్రమాలకు పాల్పడుతోంది. అటు ఉద్యోగుల నియామకాల్లో కూడా అవినీతి జరుగుతోందని 10tv పరిశోధనలో తేలింది.