Dubbaka By Poll : దుబ్బాక ఉపఎన్నికలో విజేత ఎవరు ? సిట్టింగ్ సీటును టీఆర్‌ఎస్ తిరిగి నిలబెట్టుకుంటుందా ? గత మెజార్టీని ఈ సారి క్రాస్ చేస్తుందా ? పోలింగ్‌కు పది రోజుల ముందు నుంచి బీజేపీ చేసిన హడావుడి అధికార పార్టీకి చేటు తెస్తుందా… ? కాంగ్రెస్ చెబుతున్న సైలెంట్ ఓటింగ్ ప్రభావం ఎలా ఉండబోతుంది ? ఇప్పుడివే ప్రశ్నలపై తెలంగాణ గట్టుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది.
దుబ్బాక ఫలితంపై పొలిటికల్ పార్టీలే కాదు తెలంగాణ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. క్లైమాక్స్‌లో బీజేపీ హడావుడి చేసినా, ప్రజలంతా తమవైపే ఉన్నారనే కాన్ఫిడెంట్‌తో ఉంది గులాబీ పార్టీ. కాస్త మెజార్టీ తగ్గినా… గెలుపు మాత్రం తమదేనన్న ధీమాతో ఉంది. అటు బీజేపీ కూడా గెలుపుపై భారీగా ఆశలు పెట్టుకుంది.
ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు కలిసొస్తుందని నమ్ముతోంది. అలాగే గత ఎన్నికల్లో ఓడిపోయిన సెంటిమెంట్ కూడా కలిసొస్తుందని భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా విక్టరీ మాదేనని చెబుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. సైలెంట్ ఓటింగ్ అంతా తమకే పడిందన్న భావనలో ఉంది. మొత్తానికి ట్రయాంగిల్ ఫైట్‌లో విజేతలెవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఎక్కడ ఏ నలుగురు కలిసినా దుబ్బాక రిజల్ట్‌పైనే చర్చించుకుంటున్నారు.
https://10tv.in/oscar-winning-costume-designer-bhanu-athaiya-passes-away-at/
ఓట్ల లెక్కింపు డేట్ దగ్గర పడుతున్న కొద్దీ పోలింగ్ సరళిపై నేతలు అంచనాల్లో మునిగిపోయారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, టీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గంలో ఉన్న ఓటు బ్యాంక్ తమను గట్టెక్కిస్తాయనే ధీమాలో టీఆర్‌ఎస్ శ్రేణులు ఉన్నాయి. మరోవైపు అదే స్థాయిలో అనుమానాలు కూడా గులాబీ పార్టీని వెంటాడుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో యువత ఎక్కువగా బీజేపీ వైపు ఉందని, అదే తమ గెలుపునూ చూసిస్తుందన్న ఆశల పల్లకిలో బీజేపీ ఉంది.
దీంతో ఎవరికి వారే గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరెన్ని లెక్కలు వేసినా.. ఓటరు ఇచ్చిన తీర్పుమాత్రం ఈవీఎం బాక్స్‌ల్లో నిక్షిప్తమై ఉంది. ఈనెల 10న ఓట్ల లెక్కింపు జరుగనుంది. దీంతో ఆ రోజు విజేతలెవరో.. పరాజితులేవరో తేలనుంది. అయితే లెక్కింపు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతల్లో టెన్షన్ మొదలైంది.