Dubbaka Bye elections:దుబ్బాక ఉప ఎన్నికకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 148 గ్రామాల్లో 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించారు.
సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కోవిడ్ బాధితుల కోసం పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లక్షా 98 వేల మందికి పైగా ఓటర్లు.. తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు.
https://10tv.in/dubbaka-bye-elections-to-be-started-soon-in-telangana/
ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో 20 మంది అభ్యర్థుల భవితవ్యం కొద్ది గంటల్లోనే తేలబోతోంది. దుబ్బాక బైపోల్ పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. నియోజకవర్గంలోని 315 పోలింగ్ బూత్‌ల్లో.. 5 వేల మంది సిబ్బంది పనిచేయనున్నారు.
మొత్తం లక్షా 98 వేల 756 మంది ఓటర్లు.. మరోసారి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో.. పోలింగ్ మొత్తం పూర్తిగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరపనున్నారు ఎన్నికల అధికారులు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో.. దుబ్బాకలో ఉపఎన్నిక జరుగుతోంది. ఈ బైపోల్ బరిలో.. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో 20 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు.. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు.
పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు.. ఒక్కో మండలానికి ఏసీబీ స్థాయి అధికారిని నియమించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని ప్రకటించనున్నారు. ఇప్పటికే.. పోలింగ్ శాతం పెరిగేలా.. ఓటర్లకు అవగాహన కల్పించారు ఎన్నికల అధికారులు. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరుగనుంది.