Agriculture Exam postponed : ఎంసెట్ అగ్రికల్చర్‌ పరీక్ష వాయిదా..ఇంజినీరింగ్‌ యథాతథం

ఈ నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గురువారం ప్రారంభం కానున్న ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

Agriculture exam postponed : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలుసైతం నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గురువారం ప్రారంభం కానున్న ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

అయితే ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని పేర్కొంది. షెడ్యూల్‌ ప్రకారమే ఈనెల 18 నుంచి 20 వరకు ఇంజినీరింగ్‌ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించింది. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నందన ఎంసెట్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమయ్యాయి.

Google Jobs : అప్పటివరకూ గూగుల్ ఉద్యోగ నియామకాలను ఆపేసింది.. ఎందుకో తెలుసా?

పరీక్షలు యథావిధిగా కొనసాగితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం కొంత ఊరటనిచ్చింది. వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఉన్నత విద్యామండలి తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు