×
Ad

TG EAPCET : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఈఏపీసెట్‌ దరఖాస్తుల షెడ్యూల్‌ విడుదల..

TG EAPCET : తెలంగాణలోని ఈఏపీ సెట్ దరఖాస్తుల షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

TG EAPCET

TG EAPCET : తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ – 2026 షెడ్యూల్ ను అధికారులు ఖరారు చేశారు. ఇవాళ జేఎన్టీయూహెచ్‌లో జరిగిన మొదటి సీఈటీ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు TG EAPCET అధికారిక నోటిఫికేషన్ ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కానుంది.

షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 19నుంచి ఏప్రిల్ 4వ తేదీన వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు చేసుకోవచ్చు. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు మే 4, 5 తేదీల్లో, మే 9 నుంచి జూన్ 11 వరకు ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు జరుగుతాయి. కాగా ఈ ఏడాదికి కూడా JNTU-హైదరాబాద్ ఆధ్వర్యంలోనే TG EAPCET 2026 పరీక్ష నిర్వహించనున్నారు. మిగిలిన CETలను వేర్వేరు యూనివర్సిటీలను కేటాయిస్తారు.

ముఖ్యమైన తేదీలు..
♦ తెలంగాణ ఈఏపీసెట్ -2026 నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 14 (శనివారం)
♦ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 19 (గురువారం)
♦ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్ 4 (శనివారం)
♦ పరీక్ష తేదీలు : మే4, 5 తేదీల్లో.. మే9 నుంచి జూన్ 11 తేదీల్లో..