Tg Revanth Reddy
TPCC President Revanth Reddy : తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వంపై మాటల తూటాలు పేలుస్తున్నారు. సీనియర్ నేతలు, ఇతరులతో కీలక భేటీలు నిర్వహస్తున్న రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా…తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమని బాంబు పేల్చారు. 75 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా..సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని చెప్పుకొచ్చారు. 2021, జూలై 09వ తేదీ శుక్రవారం మీడియాతో చిట్ చాట్ లో పలు కీలక వ్యాఖ్యలు వెల్లడించారు.
Read More : Walking 10,000 Steps : రోజూ నడవండి.. అదే పదివేలు..! ఆరోగ్యానికి నిజంగా నడక అవసరమా?
2022, ఆగస్టు 15 తర్వాత..సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతారని జోస్యం చెప్పారు. తెలంగాణ అమరవీరుల స్థూపం కాంట్రాక్ట్ విషయంలో రూ. 100 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపణలు గుప్పించారు. పవిత్రమైన అమరవీరుల స్థూపం నిర్మాణాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చారని, 2017, అక్టోబర్ 31వ తేదీన టీడీపీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే పదవికి తాను స్పీకర్ ఫార్మాట్ లో లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహిస్తున్నందుకే స్పీకర్ ను తాను కలవడం లేదని, కేబినెట్ లోని మంత్రులంతా…టీడీపీ నుంచి వచ్చిన వారేనన్నారు. టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వదిలేదని లేదని స్పష్టం చేశారు. మునుముందు వాళ్ల అంతు చూస్తామని హెచ్చరించారాయన.
Read More : Mumbai Traffic Police : డ్రెస్ తీసి రా..చీరేస్తా..అన్నాడు, తర్వాత ఏడ్చేశాడు.. వీడియో వైరల్
కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని, టీఆర్ఎస్ కు గతిలేకనే ఎల్.రమణను తీసుకున్నారని వ్యాఖ్యానించారు. తనకు పీసీసీ పదవి ఇస్తే..కేటీఆర్ కు ఏం బాధ అంటూ సెటైర్ విసిరారు. కేటీఆర్ లాగా తండ్రి నుంచి పదవులు తెచ్చుకోలేదని, కేటీఆర్ నోరు తెరిస్తే..అబద్దాలే మాట్లాడుతారని విమర్శించారు.