EC Focus : తెలంగాణలో ఎలక్షన్ కోడ్.. సోషల్ మీడియాపై ఈసీ స్పెషల్ ఫోకస్, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు

తప్పుడు సమాచారం, ఎన్నికల ప్రచారం వంటి బల్క్ ఎస్ఎమ్ ఎస్ లు చేసినా, రూమర్లను ప్రచారం చేసినా ఈసీ డేగ కన్నుతో చూస్తోంది.

EC focus social media

EC Focus Social Media : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియాపై సీఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. తెలంగాణ సీఈసీ ప్రత్యేక వింగ్ ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. అన్ని రాజకీయ, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై నిఘా ఉంచింది. గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ తోపాటు ఇతర సంస్థలతో ఇప్పటికే చర్చలు జరిపింది.

ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా, నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రలోభ పెట్టేలా, ఇతర వర్గాలను కించపర్చేలా చేసే పోస్టింగ్లపై వివిధ వెబ్ సైట్ల ద్వారా స్కాన్ చేశారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరిస్తోంది. తప్పుడు సమాచారం, ఎన్నికల ప్రచారం వంటి బల్క్ ఎస్ఎమ్ ఎస్ లు చేసినా, రూమర్లను ప్రచారం చేసినా ఈసీ డేగ కన్నుతో చూస్తోంది.

Anil Kumar Yadav: తండ్రి కోసం ఎమ్మెల్యే సీటు వదులుకున్న కొడుకు.. ముషిరాబాద్ అసెంబ్లీ బరిలో అంజన్న!

మరోవైపు ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అడుగడుగునా వాహనాలను సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో రూ.5 కోట్లకు పైగా నగదు పట్టుబడింది.

Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు.. ఆ నియోజకవర్గాలపై ఫోకస్

సికింద్రాబాద్ లో రూ.50 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలతోపాటు రూ.12.15 లక్షల విలువైన మద్యం బాటిళ్లు, పట్టుబడ్డాయి. సంగారెడ్డి జిల్లాలో రూ.9.4 లక్షలు, రంగారెడ్డి జిల్లాలోని ఇంబ్రహీంపట్నంలో రూ.6.50 లక్షలను పోలీసులు పట్టుకున్నారు.

నిజామాబాద్ జిల్లా – మహారాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు దగ్గర రూ.5.60లక్షలు, పెద్దపల్లి జిల్లాలో రూ.3లక్షలు, వనపర్తి జిల్లా కొత్తకోటలో రూ.2.35 లక్షలు, మహబూబ్ నగర్ జిల్లాలో రూ.2 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు