Telangana Polls: ముగ్గురు పోలీసు అధికారులపై EC సస్పెన్షన్ వేటు

119 నియోజకవర్గాలకు సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ బుధవారం ప్రకటించారు

సరిగ్గా పోలింగుకు ముందు ముగ్గురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. డబ్బుల కట్టడిలో పక్షపాతం చూపిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెండ్ అయిన వారిలో సెంట్రల్ జోన్ DCP వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ACP యాదగిరి, ముషీరాబాద్ ఇన్ స్పెక్టర్ జహంగీర్ ఉన్నారు. వీరు ఉద్దేశపూర్వంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదు అందింది. అయితే ఆరోపణలు అనుకూలంగా ఉండడంతో ఈసీ వారిపై వేటు వేసింది.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. 119 నియోజకవర్గాలకు సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ బుధవారం ప్రకటించారు. ఇక లెక్కింపు డిసెంబర్ 3న జరుగుతుంది, ఫలితాలు అదే రోజు వెలువడనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు