ECI team visit Telangana
ECI Team Visit Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ తుది కసరత్తు మొదలుపెట్టింది. హైదరాబాద్ కు కేంద్ర ఎన్నికల బృందం వచ్చింది. ఢిల్లీ నుండి చీఫ్ ఎలక్షన్ కమిషన్ హైదరాబాద్ కు చేరుకుంది. రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండే వచ్చారు. నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు జరుగనున్నాయి.
మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 వరకు గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల నుండి 7.30 గంటల వరకు పలు ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీలతో రివ్యూ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, అధికారుల ప్రెజెంటేషన్ ఉంటుంది. అక్టోబర్ 4వ తేదీన ఉదయం 6.30 గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీపై సైక్లోథాన్, వాక్ థాన్ జరుగనుంది.
Also Read: డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు!.. తాత్కాలిక ఎలక్షన్ షెడ్యూల్
అక్టోబర్ 4న ఉదయం 9.30 నుండి సాయంత్రం 7 గంటల వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలతో సమావేశం నిర్వహించనున్నారు. 4న తెలంగాణ తుది ఓటర్ జాబితాను ఈసీ విడుదల చేయనుంది. అక్టోబర్ 5వ తేదీ ఉదయం 9 గంటలకు టెక్ మహీంద్రలో స్టేట్ ఐకాన్స్, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో ఇంటరాక్షన్ జరుగనుంది.
అక్టోబర్ 5న ఉదయం 11 గంటలకు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. 5న మధ్యాహ్నం 1 గంటకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు, నిఘాపై ఆరా కేంద్ర ఎన్నికల బృందం తీయనుంది.