ESI IMS Scam : ఈఎస్‌ఐ ఐఎంఎస్‌ స్కామ్‌..రూ.144 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

ఈఎస్‌ఐ ఐఎంఎస్‌ స్కామ్‌ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మనీలాండరింగ్ కింద రూ.144 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఐదుగురు నిందితుల ఆస్తులను అటాచ్ చేసింది.

ED attached assets worth Rs.144 crore : ఈఎస్‌ఐ ఐఎంఎస్‌ స్కామ్‌ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. మనీలాండరింగ్ కింద రూ.144 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఐదుగురు నిందితుల ఆస్తులను అటాచ్ చేసింది. ఐఎంఎస్ డైరెక్టర్ తోపాటు పలువురు అధికారుల అస్తులను అటాచ్ చేసింది.

ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, మాజీ జేడీ పద్మజ, ఫార్మాసిస్ట్ కె.నాగమణి, కాంట్రాక్టర్లు శ్రీహరి, రాజేశ్వరరెడ్డి ఆస్తులను అటాచ్ చేసింది. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ దేవికారాణికి సంబంధించి మొత్తం రూ.6.50 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, నోయిడాలో ఉన్న ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు.

Telangana Ministers : రెండు రోజులుగా కేంద్రమంత్రి పీయుష్ గోయల్ కోసం తెలంగాణ మంత్రుల ఎదురుచూపులు

తెలంగాణ ఏసీబీ కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఏసీబీ నమోదు చేసిన 8 ఎఫ్ ఐఆర్ ల ఆధారంగా విచారణ ప్రారంభించింది. ఈ స్కామ్ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి రూ.211 కోట్లకు పైగా నష్టం వాటిలినట్లు అధికారులు అంచనా వేశారు.

ట్రెండింగ్ వార్తలు