అధిక లాభాల పేరుతో రూ.229 కోట్లు వసూలు.. హైదరాబాద్‌లోని DKZ టెక్నాలజీస్ స్కాంలో సంచలన నిజాలు..!

మిగిలిన 16 మంది నిందితుల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

DKZ Technologies Fraud (Photo Credit : Google)

DKZ Technologies Fraud : హైదరాబాద్ లోని డీకేజెడ్ (DKZ) టెక్నాలజీస్ స్కామ్ పై ఈడీ విచారణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసింది డీకేజెడ్ టెక్నాలజీస్. దాదాపు 17వేల మంది నుంచి రూ.229 కోట్లు వసూలు చేసింది. ఒకేవర్గం వారిని టార్గెట్ చేసి.. మీరు పెట్టే పెట్టుబడికి రెండింతలు లాభం ఇస్తామంటూ వసూలు చేసింది. ఈ స్కామ్ లో ఇప్పటికే డీకేజెడ్ టెక్నాలజీస్ డైరెక్టర్ అయేషాను అరెస్ట్ చేసి సీసీఎస్ కు తరలించారు. మిగిలిన 16 మంది నిందితుల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. DKZ స్కామ్ లో హవాలా, మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

లక్ష రూపాయలు పెట్టుబడితే మరో లక్ష లాభం..
లక్ష రూపాయలు పెట్టుబడితే మరో లక్ష లాభం వస్తుందంటూ బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన DKZ టెక్నాలజీస్ కు సంబంధించిన స్కామ్ పై ఈడీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇప్పటికే సంస్థ ఎండీతో పాటు డైరెక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 17వేల 500 మందికిపైగా సుమారు 229 కోట్ల రూపాయల మోసం జరిగినట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో హవాలా రూపంలో నగదు చేతులు మారినట్లు ఈడీ విచారణలో తేలింది.

హవాలా రూపంలో మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తింపు..
ఈ కేసుకి సంబంధించి లోతైన దర్యాఫ్తు జరుగుతోంది. అందులో భాగంగానే 16 మంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. పెద్ద మొత్తంలో హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ గుర్తించింది. పెట్టుబడి పెడితే రెండింతలు లాభం అంటూ దేశవ్యాప్తంగా బాధితుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. హైదరాబాద్ లోనూ కొన్ని వేల మంది బాధితులు ఉన్నారు.

పరారీలో మరో 16మంది నిందితులు..
ఈడీ పూర్తి స్థాయిలో దర్యాఫ్తు జరిపితే ఈ కుంభకోణానికి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. డీకేజెడ్ టెక్నాలజీస్ కు సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ అష్పాక్ రాహిల్, డైరెక్టర్ సైదా అయేషా నాజ్ భార్యభర్తలు. వీరిద్దరిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో 16 మంది నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేస్తున్నాయి. ఈ కేసుని ఇటు హైదరాబాద్ పోలీసులు, అటు సీసీఎస్ పోలీసులు చాలా చాలెంజింగ్ తీసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.

ఈడీ ఎంట్రీతో వెలుగులోకి రానున్న మరిన్ని నిజాలు..
తాజాగా ఎన్ ఫోర్స్ మెట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయ్యింది. దీంతో ఈ స్కామ్ లో మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. ఈ కేసులో పరారీలో ఉన్న మరో 16మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం బయటకు రానుంది. ఏ రూపంలో ఎక్కడెక్కడ బ్రాంచులు ఏర్పాటు చేశారు, కేవలం 17వేల 500 మందే కాకుండా ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారా? అనే సమాచారం తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రూ.229 కోట్ల స్కామ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాఫ్తు జరుగుతోంది.

 

Also Read : ఇరాన్‌కు బిగ్ షాక్..! భారీ స్థాయిలో సైబర్ దాడులు.. ఇజ్రాయెల్ ప్రతీకారం మొదలు పెట్టిందా?