KTR : ఫార్ములా ఈ కార్ కేసు.. కేటీఆర్‌పై ఈడీ ప్రశ్నల వర్షం..

కేటీఆర్ సరైన సమాధానాలు చెప్పకపోతే మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది.

KTR

KTR : ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది ఈడీ. నాలుగు గంటలకుపైగా విచారణ కొనసాగుతోంది. ఈడీ విచారణలో ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఫెమా నిబంధనలపై కేటీఆర్ ను ఈడీ ప్రశ్నిస్తోంది. కేటీఆర్ కు 25 నుంచి 30 ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది.

కార్ రేస్ ఒప్పందం చేసుకున్నది ఎవరు? నిధులు ఎవరు విడుదల చేశారు?
కార్ రేస్ ఒప్పందం చేసుకున్నది ఎవరు? నిధులు ఎవరు విడుదల చేశారు? ఫెమా నిబంధనలను ఎలా ఉల్లంఘించారు? దీనికి క్యాబినెట్ అనుమతి ఉందా? లేదా? ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందా? లేదా? బిజినెస్ రూల్స్ ఉల్లంఘన ఎందుకు జరిగింది? అన్నదానిపై ప్రశ్నలు సంధించే ఛాన్స్ ఉంది. కేటీఆర్ సరైన సమాధానాలు చెప్పకపోతే మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది.

Formula E-Car Race Case

కేటీఆర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. బషీర్ బాగ్ లో ఉన్న ఈడీ ఆఫీస్ లో ఈ విచారణ జరుగుతోంది. విచారణ మధ్యలో కేటీఆర్ కు లంచ్ విరామం ఇచ్చారు అధికారులు. ఆ తర్వాత మళ్లీ ఎంక్వైరీ కంటిన్యూ చేశారు. విచారణ సమయంలో అనేక కీలక అంశాలను ఈడీ అధికారులు ప్రస్తావిస్తున్నట్లు సమాచారం.

కీలక అంశాలపై కేటీఆర్ కు ప్రశ్నలు..
ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో డబ్బులు విదేశాలకు బదలాయించారు, నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిపారు, బ్యాంకు ఆర్థిక లావాదేవీలు, ఏయే బ్యాంకు నుంచి లావాదేవీలు జరిగాయి, ఏస్ నెక్ట్స్ జనరేషన్ కంపెనీ ద్వారా ఏ విధంగా డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారు, ఏయే కంపెనీలకు అప్రూవల్ ఇచ్చారు.. వీటన్నింటికి సంబంధించిన దానిపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం.

ఇప్పటికే ఈ కేసులో ఏ2గా ఉన్న అరవింద్ కుమార్, ఏ3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి స్టేట్ మెంట్లను నమోదు చేసిన సంగతి తెలిసిందే. వారు చెప్పిన కీలక అంశాలను కేటీఆర్ ముందు ఉంచి పలు ప్రశ్నలు సంధించారు ఈడీ అధికారులు.

Also Read : కేటీఆర్‌ని కక్ష పూరితంగా అరెస్ట్ చేయాలని రేవంత్ ప్రభుత్వం యత్నాలు: మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్

* నాలుగు గంటలుగా కేటీఆర్ ఈడీ విచారణ
* ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలపై విచారణ
* ఆర్థిక లావాదేవీలు, ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘనల అతిక్రమణపై కూపీ లాగుతున్న ఈడీ
* అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి స్టేట్ మెంట్స్ ముందు ఉంచి కేటీఆర్ ను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు
* ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థ సీజన్-9 కోసం ఎంత చెల్లించింది, ప్రభుత్వం ఎంత చెల్లించిందనే కోణంలో ఎంక్వైరీ
* బ్యాంకు అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్ ను కేటీఆర్ కు చూపించిన ఈడీ

Also Read : దూకుడు పెంచిన కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్..! ఈటల, హరీశ్‌, కేసీఆర్‌ను విచారణకు పిలుస్తారా?