హైదరాబాద్‌లో ఓ వృద్దుడి మరణం కలకలం రేపుతోంది. అటు వైద్యులు, ఇటు పోలీసుల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది.
హైదరాబాద్‌లో ఓ వృద్దుడి మరణం కలకలం రేపుతోంది. అటు వైద్యులు, ఇటు పోలీసుల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది. శుక్రవారం రాత్రి చనిపోయిన వృద్ధుడి డెడ్‌బాడీని ఇప్పటి వరకు తరలించలేదు. దీనికి కారణం అతడు కరోనా లక్షణాలతో చనిపోవడమే. అందుకే మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు భయపడుతున్నారు.
నేపాల్‌కు చెందిన 70ఏళ్ల వృద్ధుడు బహదూర్ లాలాపేట్‌లోని ఓ బార్‌లో పని చేసేవాడు. దగ్గు, జలుబు ఎక్కువగా ఉండడంతో రెండు రోజులక్రితం స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు అతడికి కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో.. గాంధీ ఆస్పత్రికి పంపించారు. అయితే గాంధీ ఆస్పత్రి వైద్యులు.. ఇక్కడ ఓపీలేదని.. కింగ్‌కోఠి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో వృద్దుడు కింగ్‌కోఠి ఆస్పత్రికి వెళ్లడా అక్కడి వైద్యులు అతడికి కరోనా ఉన్నట్టు తెలిపారు. గాంధీలో జాయిన్ కావాలని సూచించారు.
అయితే కింగ్‌కోఠి ఆస్పత్రి నుంచి గాంధీ హాస్పిటల్‌కు వెళ్లడానికి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ ఎంతకీ రాకపోవడంతో గంటలకొద్దీ ఎదురుచూశాడు. అయినా రాకపోవడంతో శుక్రవారం రాత్రి తానే స్వయంగా గాంధీకి నడుచుకుంటూ బయలుదేరాడు. మార్గమధ్యలో నారాయణగూడ శాంతి థియేటర్ సమీపంలో కుప్పకూలిపోయాడు. అక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే ఆ రాత్రంగా బహదూర్ మృతిని ఎవరూ గమనించలేదు. నిన్న ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
అయితే అతడి చేతిలోని డాక్టర్లు రాసిన చీటి ఆధారంగా అతడు కరోనా లక్షణాలతో చనిపోయినట్టు గుర్తించారు. దీంతో అతడి డెడ్‌బాడీని తరలించేందుకు పోలీసులు ముందుకురాలేదు. అప్పటి నుంచి బహదూర్ మృతదేహం అక్కడే ఉంది. ఇక రాత్రి అంబులెన్స్‌లోకి బాడీని ఎక్కించినా దాన్ని అక్కడే ఉంచారు. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.(ఏపీలో కరోనా : 133 రెడ్ జోన్లు…నెల్లూరులో 30..)