Telangana Assembly Election 2023 : ఇక ఓటర్లకు అభ్యర్థుల ఫోన్ కాల్స్.. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఎన్నికల ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుండటంతో చివరి అంకంలో అన్ని పార్టీల అభ్యర్థులు ర్యాలీలు జరిపారు. ప్రచార పర్వానికి తెరపడుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లకు ఫోన్ కాల్స్ ప్రచారంలో నిమగ్నమయ్యారు.....

Election campaign through IVRS calls

Telangana Assembly Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుండటంతో చివరి అంకంలో అన్ని పార్టీల అభ్యర్థులు ర్యాలీలు జరిపారు. ప్రచార పర్వానికి తెరపడుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లకు ఫోన్ కాల్స్ ప్రచారంలో నిమగ్నమయ్యారు. పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు అభ్యర్థులు వారి గొంతుకతో తమ పార్టీ గుర్తుకే ఓటేసి ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థిస్తూ ఓటర్లకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ఫోన్ కాల్స్ చేస్తున్నారు.

‘‘నేను మీ కేటీఆర్ ను అంటూ ఓటర్లకు పలకరిస్తూ తాము తొమ్మిదిన్నరేళ్లలో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రస్థావించి అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటేయండి’’ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నారు. చాలా మంది అభ్యర్థులు వారి సొంత గొంతుతోనే రికార్డు చేసి ఓటర్లకు ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ చేస్తున్నారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : పోటాపోటీగా ఓటరు స్లిప్పుల పంపిణీ.. ఇంటింటికి కార్యకర్తల బృందాలు

వాయిస్ ఫోన్ కాల్స్ పై దృష్టి

మొత్తం మీద ప్రచార పర్వం ముగియనుండటంతో అభ్యర్థులందరూ వాయిస్ ఫోన్ కాల్స్ పై దృష్టి సారించారు. వరుస ఫోన్ కాల్స్ తో గిదేం లొల్లి అని ఓటర్లు సతమతమవుతున్నారు. ఇలా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులందరూ వరుస ఫోన్లతో ఓటర్లకు మోత మోగిస్తున్నారు. అభ్యర్థులు ఫోన్లు చేస్తున్నారంటే ఓటు ఉన్నట్లేనని భావించవచ్చు.

ALSO READ : Kerala Court : ప్రియుడిపై మోజు .. కన్నకూతుళ్లపై లైంగిక వేధింపులకు సహకరించిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష

ఫోన్లకు తోడు వాట్సాప్, ఫోన్ మెసేజులు సైతం తామర తుంపరగా వచ్చి పడుతున్నారు. ఎంతైనా ఓట్ల సీజన్ కదా…అన్ని పార్టీల అభ్యర్థులు ఓటరు దేవుడంటూ దండాలు పెట్టి మరీ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దీంతో పాటు కొన్ని సర్వే సంస్థలు రంగంలోకి దిగి మీరు ఎవరికి ఓటు వేస్తారు? బీఆర్ఎస్ అయితే 1, బీజేపీ,జనసేన అయితే 2, కాంగ్రెస్, సీపీఐ అయితే 3, ఎంఐఎం అయితే 4, బీఎస్పీ అయితే 5 నంబరు నొక్కాలని వాయిస్ వినిపిస్తోంది. ఓటర్లు ఈ సర్వే కాల్స్ తో విసిగిపోతున్నారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : తెలంగాణ పోలింగ్ పర్వంపై అందరి దృష్టి

ట్రెండింగ్ వార్తలు