Huzurabad By-Election : రేపే హుజూరాబాద్ బైపోల్.. డిసైడర్లు మహిళా ఓటర్లే

హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Huzurabad by-election polling : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు సిబ్బందికి విధులను కేటాయించనున్నారు. ఈవీఎంలతో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,37,036 కాగా, పురుషులు 1,17,933, స్త్రీలు 1,19,102 ఉన్నారు. 14 మంది ఎన్.ఆర్. ఐ ఓటర్లు ఉన్నారు. మహిళ ఓటర్లు నేతల భవితవ్యం తేల్చనున్నారు. 306 పోలింగ్ కేంద్రాల్లో 306 కంట్రోల్ యూనిట్స్ తో పాటుగా 612 బ్యాలెట్ యూనిట్స్, 306 వివి ఫ్యాట్స్ ఏర్పాటు.

Dalit Bandhu : హుజూరాబాద్ లో దళితబంధుపై దాఖలైన నాలుగు పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

రేపే ఎన్నికలు జరగనుండటంతో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఎన్నిక నిర్వహణకు 20 కంపెనీల బలగాలను సెంట్రల్‌ ఎలక్షన్ కమిషన్‌ పంపించింది. ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పొలిటికల్ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. దీంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా సీఈసీ చర్యలు తీసుకుంది.

ట్రెండింగ్ వార్తలు