Dalit Bandhu : హుజూరాబాద్ లో దళితబంధుపై దాఖలైన నాలుగు పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

దళితబంధు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హుజూరాబాద్ లో దళితబంధు నిలిపివేతపై దాఖలైన నాలుగు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.

Dalit Bandhu : హుజూరాబాద్ లో దళితబంధుపై దాఖలైన నాలుగు పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

High Court

Updated On : October 28, 2021 / 11:31 AM IST

High Court dismissed four petitions : దళితబంధు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హుజూరాబాద్ లో దళితబంధు నిలిపివేతపై దాఖలైన నాలుగు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. హుజూరాబాద్ లో దళితబంధు నిలిపివేయడంపై హైకోర్టులు నిన్ననే వాదనలు ముగిశాయి. దళితబంధు పథకాన్ని ఎన్నికల సంఘం ఆపడం సరైందని కాదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే పథకం అమలవుతోందని పిటిషన్లు చెప్పారు.

దళితబంధు పథకాన్ని అమలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. వాదనలు విన్న హైకోర్టు నిన్ననే దళితబంధు అమలుపై తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ పిటిషన్ల వాదనలను తోసిపుచ్చుతూ నాలుగు పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసిన దళితబంధు కొనసాగించాలని హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే పిటిషనర్ల వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. దళితబంధు అమలు చేయాలంటూ దాఖలైన నాలుగు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.
CM KCR : నవంబర్ 4 నుంచి యథావిధిగా దళితబంధు : సీఎం కేసీఆర్

హుజురాబాద్ ఉపఎన్నికల వేళ పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ‘దళితబంధు’ను వెంటనే నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యథావిధిగా కొనసాగించుకోవచ్చునని స్పష్టం చేసింది. హుజురాబాద్‌లో ఉపఎన్నికలు ఉన్నందున దళితబంధుతో ఓటర్లు ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉందని ఈసీ అభిప్రాయపడింది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి అమలు చేసుకోవచ్చని సూచించింది.

మరోవైపు దళితబంధుపై ఈనెల 19న సీఎం కేసీఆర్ స్పందించారు. ఈసీ తన పరిధిని అతిక్రమించిందన్నారు. దళితబంధును ఈసీ ఎన్ని రోజులు ఆపగలదన్నారు. దళితబంధు విషయంలో ఎవరూ చింతించాల్సిన అవసరం లేదన్నారు. దళితబంధు అర్హులు ఆందోళన చెందవద్దన్నారు. ఉప ఎన్నిక తర్వాత తన చేతుల మీదుగా దళితబంధు పంపిణీ చేస్తానని తెలిపారు. దళితబంధు ఆన్ గోయింగ్ స్కీమ్ అన్నారు. నవంబర్ 4 నుంచి యథావిధిగా దళితబంధు అమలవుతుందన్నారు.

Huzurabad ByPoll : దళితబంధును వెంటనే నిలిపివేయాలి.. ఈసీ ఆదేశం!

సీఎం కేసీఆర్ దళితబంధును ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద అర్హులైన దళితులకు రూ.10 లక్షలు అందిస్తున్నారు. ఇప్పటికే హుజూరాబాద్, వాసాలమర్రిలో అర్హులైన దళిత కుటుంబాలకు ‘దళితబంధు’ నిధులను విడుదల చేశారు. మూడు విడతల్లో ఈ డబ్బులను వారి ఖాతాల్లోకి జమ చేశారు.