Electric Shock : ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో షాట్ సర్క్యూట్.. ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా కాలి పోయిన విద్యుత్ వైర్లు

పక్కకు జరగాలని మోదీ సభలో ఉన్నవారిని అప్రమత్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని సిబ్బందిని ప్రధాని ఆదేశించారు.

MRPS Sabha Electric Shock: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ప్రధాని మోదీ సభలో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో షాట్ సర్క్యూట్ అయింది. ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు కాలి పోయాయి. పక్కకు జరగాలని మోదీ సభలో ఉన్నవారిని అప్రమత్తం చేశారు.

సమస్యను పరిష్కరించాలని సిబ్బందిని ప్రధాని ఆదేశించారు. సిబ్బంది సమస్యను పరిష్కరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో అధికారులు, ప్రజలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతకముందు ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో ఓ యువతి హల్ చల్ చేశారు.

PM Modi : ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం.. త్వరలో కమిటీ ఏర్పాటు : ప్రధాని మోదీ

ప్రధాని మోదీని యువతి టెన్షన్ పెట్టారు. మోడీ ప్రసంగిస్తుండగా యువతి విద్యుత్ లైట్లు అమర్చి ఉన్న స్తంభం పైకెక్కి యువతి హల్ చల్ చేశారు. దీంతో ప్రధాని మోదీ యువతిని కిందికి దిగాలని కోరారు. “నేను నీవు చెప్పేంది వింటాను” అని అన్నారు. నీవు స్థంభం పైకెక్కడం మంచి పద్ధతి కాదన్నారు. దయచేసి కిందికి దిగి రావాలని యువతిని ప్రధాని కోరారు.

‘నేను మీ కోసమే ఇక్కడికి వచ్చాను’ అని అన్నారు. సభలో మోదీ ప్రసంగిస్తుండగా యువతి స్థంభం ఎక్కడంతో సభలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మోదీతోపాటు వేదికపై నున్న నేతలందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మోదీ విజ్ఞప్తితో యువతి కిందకు దిగారు. చివరకు ఆమె కిందికి దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు