Intercity Express : తప్పిన పెనుప్రమాదం.. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌పై తెగిపడ్డ విద్యుత్‌ తీగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Intercity Express : ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. మౌలాలి దగ్గర ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌‌పై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.

Intercity Express

Intercity Express : ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. మౌలాలి దగ్గర ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌‌పై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. భారీ శబ్దాలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రైలు దిగి పరుగులు తీశారు. రైలు విజయవాడ నుంచి సికింద్రాబాద్ కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, సాంతికేక లోపం కారణంగానే విద్యుత్ తీగలు తెగిపడినట్లు అధికారులు నిర్ధారించారు.

Also Read : Konda Surekha Meeting: కొండా దంపతుల సంచలన సమావేశం.. అనంతరం ఢిల్లీకి సురేఖ.. పర్యటనపై ఉత్కంఠ, కేబినెట్ స్థాయి పదవి?

మౌలాలి వద్ద ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. వెంటనే లోకోపైలట్ అప్రమత్తమై రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో పెద్ద శబ్దాలు వినిపించడంతో ప్రయాణికులు రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రైల్వే అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి.. విద్యుత్ తీగలను పునరుద్ధరించారు. అనంతరం ప్రయాణినులను అదే రైలులో సికింద్రాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై రైల్వే, విద్యుత్ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక లోపం కారణంగానే విద్యుత్ తీగలు తెగిపడినట్లు అధికారులు నిర్థారించారు.

ఆదివారం రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో విజయవాడ నుంచి లింగంపల్లి వచ్చే ఇంటర్‌ సిటీ ట్రైన్‌ నగరంలోని ఆలుగడ్డ బావి వద్ద నిలిచిపోయింది. ఆ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లకు అంతరాయం కలిగింది. అర్ధరాత్రి దాటే సమయానికి సిబ్బంది ఓహెచ్‌ను సరిచేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. రైలు పునరుద్దరణకు సమయం పట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొందరు రోడ్డు మార్గాన నగరంలోకి బయల్దేరారు. సుమారు కిలో మీటరున్నర చీకట్లో, చెట్ల మధ్య నడిచి బస్సులు రాకపోకలు సాగించే ప్రాంతానికి చేరుకొని గమ్యస్థానాలకు పయనమయ్యారు. లగేజీ, పిల్లలున్న ప్రయాణికులు, వృద్ధులు రైలును పునరుద్దరించే వరకు రైలులోనే వేచి ఉన్నారు.