TGSRTC: పండుగ వేళ ప్రయాణికులకు భారీ షాక్.. చార్జీలు పెంచిన TGSRTC.. ఏకంగా 50 శాతం
పండుగల వేళ సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురైంది.
TGSRTC hiked 50 percent fares on special buses due to the festive rush.
- ఆర్టీసీ ప్రయాణికులకు తీవ్ర షాక్
- స్పెషల్ బస్సుల్లో ఛార్జీల పెంపు
- ఏకంగా 50 శాతం అదనపు భారం
TGSRTC: తెలుగు రాష్ట్రాల్లో రానున్న వరుస పండుగల వేళ సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని ప్రత్యేక సర్వీసుల పేరుతో ఆర్టీసీ యాజమాన్యం చార్జీల మోత మోగించింది. ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో సాధారణ రోజుల కంటే ఏకంగా 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తుండటంతో ప్రయాణికుల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడనుంది.
Vijay- Ajith: విజయ్ కి TVK సూట్ గిఫ్ట్ ఇచ్చిన అజిత్.. షాకైన తమిళనాడు సీఎం.. వైరల్ అవుతున్న పిక్స్
స్పెషల్ బస్సుల్లో ఛార్జీల బాదుడు:
ప్రధానంగా హైదరాబాద్ నగరం నుండి విజయవాడ, ఖమ్మం, కరీంనగర్, సత్తుపల్లి వంటి ప్రధాన ప్రాంతాలకు నడిచే స్పెషల్ సర్వీసుల్లో ఈ పెంచిన చార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రయాణికులు ఎంచుకునే డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధానితో పాటు ఏసీ, నాన్-ఏసీ బస్సు సర్వీసు రకాలను బట్టి ఈ 50 శాతం అదనపు బాదుడు ఉండనుంది. పండుగ పూట గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు ఈ చార్జీల పెంపుతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
