Telangana CM Revanth Reddy
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలపై ఫోకస్ పెట్టింది. ఇటీవలే హస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడంతో అలర్ట్ అయిన ప్రభుత్వం పూర్తిగా గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ హస్టళ్లపై ప్రత్యేక పర్యవేక్షణ కోసం సిద్ధం అయ్యింది.
దీనికి గాను జిల్లా అదనపు కలెక్టర్లకు గురుకులాల బాధ్యతను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గురుకులాలు.. ప్రభావవంతంగా నడవడానికి, నాణ్యమైన విద్యను అందించడానికిగాను రేవంత్ సర్కార్.. మహిళా ఐఏఎస్ లు, అదనపు కలెక్టర్లకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది.
అదనపు కలెక్టర్లు హస్టళ్లను సందర్శించి… విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తారు. బాలికల గురుకులాల భాధ్యతను ప్రభుత్వం మహిళా ఐఏఎస్‌ల కు అప్పగించింది. విద్యాలయాలు సరిగా పని చేయడంలో ఉన్న లోపాలను వీరు గుర్తించాల్సి ఉంటుంది.
ఏడు రోజుల్లోగా గురుకుల విద్యాలయం సంబంధిత ఎస్సీ, బీసీ, మైనారిటీ, విద్యా శాఖలకు నివేదికను సమర్పించాలని ఆదేశించింది ప్రభుత్వం. హాస్టళ్ల సరుకుల కొనుగోలు కమిటీలకు అదనపు కలెక్టర్లే చైర్మన్లుగా వ్యవహరించాలని సూచించింది ప్రభుత్వం.
తెలంగాణలోని మహిళా ఐఏఎస్ అధికారులు ఈ జనవరి నుంచి 15 రోజులకొకసారైనా బాలికల గురుకుల విద్యాలయాలను సందర్శించాలి. ఈ సందర్శనల్లో ఒక్కసారైనా గురుకులాల్లో రాత్రి బస చేయాలి. స్టూడెంట్స్, సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితులను పరిశీలించాలి.
Gold And Silver Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?