Etela Huzurabad Tour : హుజూరాబాద్‌కు ఈటల.. బీజేపీ నేతగా తొలిసారి రాక..

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గానికి గురువారం (జూన్ 17) మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ వెళ్లనున్నారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా ఆయన తన సొంత నియోజకవర్గానికి వెళ్లనున్నారు.

Etela Rajender Huzurabad Tour : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి గురువారం (జూన్ 17) మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ వెళ్లనున్నారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా ఆయన తన సొంత నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈటల రాకతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు, మద్దతుదారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

హుజురాబాద్ కు చేరుకున్న అనంతరం ఈటల అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల వేయనున్నారు. అనంతరం జమ్మికుంట మండలం నాగారం బయల్దేరనున్నారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జమ్మికుంటలోని పలు గ్రామాల ప్రజలను ఈటల కలవనున్నారు. బీజేపీ నేతగా తొలిసారి తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌కు వెళ్తున్నారు.

ఇటీవల ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన ఈటల అక్కడే జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ తిరిగి వచ్చే క్రమంలో ఈటల బృందానికి ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆలస్యంగా బయల్దేరింది. ఆ తర్వాత ఆయన క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం రోజున మేడ్చల్ జిల్లాలోని షామీర్‌పేట్‌లోని తన నివాసంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరిచంద్ర రెడ్డితో ఈటల సమావేశమయ్యారు.

తెలంగాణలో ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమం మొదలైందని ఈటల అన్నారు. హుజురాబాద్ ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా అభివర్ణించారు. హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రజలు సొంత ఎన్నికగా భావిస్తున్నారని అన్నారు. ఉద్యమంలో హుజురాబాద్ నియోజకవర్గం స్పూర్తిని నింపిందని ఈటల గుర్తు చేశారు. బీజేపీలో చేరటం గర్వంగా ఫీలవుతున్నానని చెప్పారు. 2024లో తెలంగాణలో ఎగిరేది కాషాయం జెండా అని ఈటల జోస్యం చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు