Eatala Resigned: ఈటల రాజేందర్ రాజీనామా.. హుజూరాబాద్‌లో కురుక్షేత్రమే!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ముందుగా గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించి, అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను అందజేశారు.

Eatala Rajender Resigned: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ముందుగా గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించి, అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను అందజేశారు. స్పీకర్ ఫార్మేట్‌లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేసిన ఈటల.. సాయంత్రం ఢిల్లీ వెళ్లి 14వ తేదీన బీజేపీలో చేరనున్నారు.

Etela Resign

ఈ సంధర్భంగా మాట్లాడిన ఈటల.. 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఓటమి లేకుండా ప్రజల్లో ఉన్నాను. తెలంగాణ కోసం అసెంబ్లీ వేదికగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రశ్నించాను.. పోరాడాను.. ఇతర పార్టీలలో గెలిచి టీఆర్ఎస్‌లో చేరి చాలామంది మంత్రులు అయ్యారు. చట్టాన్ని అతిక్రమించి టీఆర్ఎస్‌ పార్టీలో చేరినవాళ్లూ ఉన్నారు. వందల, వేల కోట్లు ఉన్న వాళ్ళను వదిలేసి నాలాంటి బిడ్డపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

హుజూరాబాద్ ప్రజలకు కేసీఆర్ కుటుంబం మధ్య ఘర్షణ జరగబోతోంది. హుజురాబాద్ లో కౌరవులు- పాండవుల మధ్య కురుక్షేత్రం జరగబోతోంది. హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో నేను రాజీనామా చేస్తున్నాను. రైతులు ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రజల సమస్యలు పట్టవు కానీ, ఎమ్మెల్సీ-ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ సమీక్షలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు ఈటల.

వందల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం సంపాదించుకుంది. ఈటలకు జైళ్లు- కేసులు కొత్త కాదు. ఈటెల రాజేందర్ డిఎన్ఏ లౌకిక వాదం. పార్టీ పెట్టి నడపాలని చాలామంది నాకు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం మేధావులతో కమిటీ వేస్తాం అన్న మాట గంగలో కలిసింది. తెలంగాణలో చైతన్యం-సంఘాలు- ఐక్యత ఉండొద్దు అని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులరా.. హుజురాబాద్ కదిలి రండి.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం రాబోయేకాలంలో పోరాటం చేస్తా అంటూ ఈటల ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు