Etela To Join BJP : ఈటల బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు!

బీజేపీలో ఈటల రాజేందర్ చేరికకు ముహుర్తం ఖరారైనట్టే కనిపిస్తోంది. ఈ నెల 14న ఈటల బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఈటల కాషాయం గూటికి చేరనున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Etela Rajender To Be Joined In Bjp

Etela To Join BJP : బీజేపీలో ఈటల రాజేందర్ చేరికకు ముహుర్తం ఖరారైనట్టే కనిపిస్తోంది. ఈ నెల (జూన్, 2021) 14న ఈటల బీజేపీ చేరనున్నట్టు సమాచారం. జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఈటల కాషాయం గూటికి చేరనున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈటల ఇప్పటికే టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

శుక్రవారం లేదా శనివారం ఎమ్మెల్యే పదవికి అధికారికంగా ఈటల రాజీనామా చేయనున్నారు. త్వరలో స్పీకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందివ్వనున్నట్లు సమాచారం. రాజీనామాపై స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ కోరనున్నట్లు ఈటల సన్నిహితుల్లో ఒకరు తెలిపారు.

ఈటల చేరికతో బీజేపీ మరింత బలోపేతం కానుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈటలతో పాటు బీజేపీలోకి ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ తదితరులు కూడా చేరనున్నట్టు తెలిసింది.