Telangana Election Counting : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. 10 గంటలకు తొలి ఫలితం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.

Telangana Election Counting Arrangements

Telangana Election Counting Arrangements : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 8.30 నిమిషాల నుంచి EVM ల లెక్కింపు ఉంటుంది. తొలి ఫలితం ఉదయం 10 గంటలకు వెలువడే అవకాశం ఉంది. దీంతో ఆయా పార్టీల నేతలంతా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తమ రాజకీయ జాతకం బాగుండాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ఇక ప్రధాన పార్టీల నేతలు గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నా.. మరోపక్క ఆందోళనగాను, ఉత్కంఠగాను ఎదురు చూస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కోసం 49 కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లో 4 కేంద్రాలు, రంగారెడ్డి జిల్లాలో 14, 31 జిల్లాల్లో జిల్లాకో కౌంటింగ్ కేంద్రం ఉండనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. 113 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు, 6 నియోజకవర్గాలకు 28 టేబుళ్లు చొప్పున ఈసీ ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. గెలిచిన తమ అభ్యర్థులను కాపాడుకునే యత్నాల్లో పడింది. అటు బీఆర్ఎస్ కూడా తమ విజయంపై నమ్మకంగా ఉంది. తామే గెలుస్తామని, సంబరాలకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ నాయకులతో సీఎం కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది.

పోలీస్ శాఖ సర్వం సిద్ధం
తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తోంది. కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడు అంచెల భద్రత కల్పించడంతో పాటు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ కు డబుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ ఒకే ద్వారం నుండి ఎంట్రీ, ఎక్సిట్ ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు పోలీస్ శాఖ ప్రకటించింది.

Also Read: ఈసీ కీలక నిర్ణయం.. మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీ మార్పు

ట్రెండింగ్ వార్తలు