Site icon 10TV Telugu

Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావుకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు..

Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు స్పల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు హరీశ్ రావుకి చికిత్స అందిస్తున్నారు. హై ఫీవర్ తో హరీశ్ రావు బాధ పడుతున్నారు. కేటీఆర్ ఏసీబీ విచారణ అనంతరం బీఆర్ఎస్ భవన్ కు వెళ్లిన సమయంలో హరీశ్ కాస్త ఇబ్బంది పడ్డారు. కేటీఆర్ సమావేశం మధ్యలోనే హరీశ్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్నారు. హరీశ్ రావుని పరామర్శించనున్నారు.

Exit mobile version