Jeevan Reddy: రేవంత్ రెడ్డిని దింపే వాళ్లతో కలుస్తా- 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూలో జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తోందన్నారు. అధిష్టానం జోక్యం అనేది ఎక్కడా కనిపించడం లేదన్నారు.
- Naveen
- Published On : March 29, 2026 / 09:37 PM IST
Jeevan Reddy: 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడారు. పలు అంశాలపై స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారాయన. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇంటికి పంపే పార్టీలోకి తాను వెళ్తానని జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మార్పు కావాలి, రేవంత్ రెడ్డి పోవాలి ఇదే తన ఆలోచనా విధానం అని జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి పోవడం ఎవరితో సాధ్యం అవుతుందో ఆలోచిద్దాం, ఆ పార్టీలోకి తాను వెళ్తాను అని కామెంట్ చేశారాయన. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తోందన్నారు. అధిష్టానం జోక్యం అనేది ఎక్కడా కనిపించడం లేదన్నారు.
”ఎమ్మెల్యే సంజయ్ వెనకున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే. నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లడం అంటూ ఉండదు. కేసీఆర్ పట్ల నాకు గౌరవం ఉంది. బీజేపీ ఎంపీ అరవింద్ కుమార్ పట్ల అభిమానం ఉంది. నాకు కేసీఆర్, డి శ్రీనివాస్ రెండు కుటుంబాలతోనూ అనుబంధం ఉంది. 2019లో అరవింద్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని నేను అనుకున్నా. దీని గురించి అరవింద్ తో మాట్లాడాను కూడా. మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయండని కోరా. అయితే, అప్పుడు కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు లేవని ఆయన బీజేపీ నుంచి బరిలోకి దిగారు” అని జీవన్ రెడ్డి అన్నారు.
Also Read: నిధుల కోసం ప్రాధేయపడాల్సి వస్తోంది- మరోసారి సీఎం రేవంత్ పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
