Jeevan Reddy: కాంగ్రెస్ కు రాజీనామాపై జీవన్ రెడ్డి కీలక ప్రకటన.. సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు
అదే రోజు జగిత్యాలలో జరిగే సమావేశానికి హాజరై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు జీవన్ రెడ్డి.
- Naveen
- Published On : March 22, 2026 / 05:25 PM IST
- ఈ నెల 25న నా రాజకీయ భవిష్యత్ నిర్ణయం
- సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కార్యకర్తలకు విజ్ఞప్తి
- పార్టీలో నాకు గౌరవం లేదు
- నాకు అన్యాయం చేసిన వారిలో సీఎం రేవంత్ కూడా ఒకరు
Jeevan Reddy: కాంగ్రెస్ కు రాజీనామాపై సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తానిక కాంగ్రెస్ లో కొనసాగలేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, ఏఐసీసీ సభ్యత్వానికి ఈ నెల 25న రాజీనామా చేస్తానని ప్రకటించారు. అదేరోజు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. 25న జగిత్యాలలో జరిగే సమావేశానికి హాజరై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కార్యకర్తలకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు జీవన్ రెడ్డి.
”ఈ నెల 25న నా రాజకీయ భవిష్యత్ నిర్ణయం ఉంటుంది. నాలుగు దశాబ్దాలుగా నాతో నడిచిన కార్యకర్తలు, సన్నిహితులు సూచనలు ఇవ్వండి. జగిత్యాలలోని బండారు గార్డెన్ లో 25న ముఖ్య నేతలతో సమావేశం. పార్టీలో కొనసాగలేను. ఈ క్షోభ భరించలేను. పార్టీలో నాకు గౌరవం లేదు.
నాకు అన్యాయం చేసిన వారిలో సీఎం రేవంత్ కూడా ఒకరు. రేవంత్ రెడ్డి వల్ల నా గౌరవానికి భంగం కలిగింది. నాకు రేవంత్ అంటే గౌరవం ఉన్నా.. నా సమస్యకు పరిష్కారం అయన దగ్గర కూడా లేదు. 10 మంది ఎమ్మెల్యేలను పార్టీ వ్యవహారాలకు దూరం పెట్టగలరా? మేడిగడ్డ ను రిపేర్ చేసే బాధ్యత లేదా? రైతాంగం సాగునీటికి ఇబ్బంది పడుతోంది” అని జీవన్ రెడ్డి అన్నారు.
Also Read: వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త.. రెండో వాహనం కొనుగోలుపై ఆ ట్యాక్స్ రద్దు
