KTR : సీఎం రేవంత్ ధనదాహం వల్లే..!- ఎస్ఎల్ బీసీ టన్నెల్ ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు..

జాగ్రత్తలు తీసుకోకుండా పదేళ్లు ఆగిన ప్రాజెక్ట్ ను ప్రారంభించారని మండిపడ్డారు కేటీఆర్.

KTR

KTR : ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీమంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను రక్షించాల్సింది పోయి.. బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని ఫైర్
అయ్యారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ధనదాహం వల్లే 8 కార్మికులు టన్నెల్ లో చిక్కుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. జాగ్రత్తలు తీసుకోకుండా పదేళ్లు ఆగిన ప్రాజెక్ట్ ను ప్రారంభించారని మండిపడ్డారు కేటీఆర్.

‘ప్రాజెక్ట్ పనుల ప్రారంభానికి ముందు ఎవరినీ సంప్రదించలేదు. జీఎస్ఐని సంప్రదించలేదు. ఇంజినీరింగ్ నిపుణులను సంప్రదించలేదు. 15ఏళ్ల క్రితం నాటి ప్రాజెక్ట్ అది. ధన దాహంతో ఆ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించారు. దాని వల్లే ప్రమాదం జరిగింది. 8 మంది కార్మికులు టన్నెల్ లో చిక్కుకుపోయారు. ఆ 8మంది కార్మికులు బతికున్నారో లేదు కూడా తెలియదు.

Also Read : డేంజర్ బెల్స్.. ఐదు రోజులు జాగ్రత్త.. ఆ సమయాల్లో బయటకు రావొద్దు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

వారి బాగోగులు చూసుకోకుండా సీఎం చేస్తున్న పని ఏంటి? బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు. గత ప్రభుత్వానిదే తప్పు అని నెట్టేస్తున్నారు. ఏదో ఒక విధంగా టాపిక్ ను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. వేరే వాళ్లని బద్నాం చేయాలని చూస్తున్నారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. గత 15 నెలలుగా మీరు చేస్తున్నది అదే. డైవర్షన్ పాలిటిక్స్. టైమ్ పాస్ చేస్తున్నారు’ అని ముఖ్యమంత్రి రేవంత్ పై ధ్వజమెత్తారు కేటీఆర్.

కాగా, ఢిల్లీ పర్యటనలో మీడియాలో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేటీఆర్ టార్గెట్ గా ఆయన చెలరేగిపోయారు. తెలంగాణలో ఇటీవల చోటు చేసుకున్న మూడు మరణాలను కేటీఆర్ కు ముడిపెడుతూ హాట్ కామెంట్స్ చేశారాయన. ఇటీవల జరిగిన మూడు అనుమానాస్పద మరణాలపై కేటీఆర్ నోరెత్తడం లేదే అని రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ అనుమాదాస్ప మృతిపై కేటీఆర్ ఎందుకు స్పందించలేదు? విచారణ కోరతారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Also Read : మీకు రైతుభరోసా డబ్బులు ఇంకా పడలేదా.. ఇదే కారణం.!

”రాష్ట్రంలో మూడు అనుమానాస్పద మరణాలు జరిగాయి. రాడిసన్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న నిర్మాత కేదార్, కాళేశ్వరం కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన రాజలింగ మూర్తి మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదు? ఈ మరణాలపై ఫిర్యాదులు వస్తే దర్యాఫ్తు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డ్రగ్స్ కేసు త్వరలోనే విచారణకు రాబోతుంది” అని సీఎం రేవంత్ అన్నారు. తనను ఉద్దేశించిన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఘాటుగా బదులిచ్చారు కేటీఆర్.