KTR Representative Image (Image Credit To Original Source)
Ktr: తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంంట్ కేటీఆర్ అన్నారు. తన పేరుతో కొంతమంది సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై కేటీఆర్ స్పందించారు. ఎవరైనా పని చేయాలనుకుంటే బీఆర్ఎస్ తో కలిసి పని చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కొంతమంది ‘కేటీఆర్ సేవా సమితి’ పేరుతో కొన్ని కార్యకలాపాలు చేపడుతున్న విషయం కేటీఆర్ దృష్టికి వెళ్లింది. కేటీఆర్ పేరుతో ఇతర సంస్థలను ఏర్పాటు చేసుకున్న అంశం సైతం కూడా కేటీఆర్ దృష్టికి వెళ్లింది.
ఈ నేపథ్యంలో తన పేరుతో ఎలాంటి సంస్థలకి అనుమతి లేదని… అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోము అని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఇలాంటి సంస్థలకు ఎటువంటి గుర్తింపు, అనుమతి లేదన్న విషయాన్ని అందరూ గుర్తించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా పని చేయాలనుకుంటే కచ్చితంగా బీఆర్ఎస్ పరిధిలోనే పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలను ఆపేయాలని సూచించారు కేటీఆర్. తనపై అభిమానం ఉన్న వాళ్లు ఎవరైనా భారత రాష్ట్ర సమితితో కలిసి పని చేయవచ్చని విజ్ఞప్తి చేశారు.
Also Read: భార్య, కూతురిని అడ్డం పెట్టుకుని, వీడియో తీసుకున్నారన్న విమర్శలపై కౌశిక్ రెడ్డి కీలక కామెంట్స్