మేము అధికారంలోకి వస్తే వారి పేర్లను తొలగిస్తాం- కేటీఆర్

తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే అర్హత రేవంత్ కు లేదు. గాంధీ విగ్రహం గాడ్సే పెట్టినట్లు ఉంటుంది.

Ktr : సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేవెళ్లలో మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే అర్హత రేవంత్ కు లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ జాతీయ నాయకుల పేర్లను అన్నింటినీ తొలగిస్తామని చెప్పారు.

Ktr : ”రాష్ట్రంలో రూ.370 కోట్ల మిగులు నిధులు ఉన్నాయి. రుణమాఫీ, రైతు బంధు నిధులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. అదానీ విషయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అదానీపై సుప్రీం జడ్జితో విచారణ జరిపించాలి. మా హయాంలో అదానీని రాష్ట్రంలో అడుగు పెట్టనియ్యలేదు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అదానీ ఎలా వస్తారు? అదానీ పెట్టుబడులపై రేవంత్ ఒప్పందం చేసుకున్నారు. పార్టీలో పట్టు కోసం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని రేవంత్ అనుకుంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే అర్హత రేవంత్ కు లేదు. గాంధీ విగ్రహం గాడ్సే పెట్టినట్లు ఉంటుంది. మేము అధికారం లోకి వస్తే… కాంగ్రెస్ జాతీయ నాయకుల పేర్లను అన్నింటినీ తొలగిస్తాము. సీఎం రేవంత్ కు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. తెలంగాణలో కాంగ్రెస్ లో రాజ్యసభకు అర్హులు లేరా?” అని ప్రశ్నించారు కేటీఆర్.

 

Also Read : హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆ ఫామ్‌హౌసేనా? హైడ్రా అసలు లక్ష్యం ఏంటి..

ట్రెండింగ్ వార్తలు