KTR Injury: కేటీఆర్‌కు గాయం.. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలన్న డాక్టర్లు..

ఈ మేరకు ఎక్స్ లో పోస్టు పెట్టారు కేటీఆర్.

KTR

KTR Injury: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. జిమ్ లో వర్కౌట్ చేస్తూ గాయపడినట్లు కేటీఆర్ తెలిపారు. నడుముకు గాయమైందన్నారు. వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తానని ఆయన చెప్పారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు పెట్టారు కేటీఆర్.

Also Read: కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్.. ఆ విషయంలో కొంత వెనకబడ్డామంటూ వ్యాఖ్య

కాగా, కేటీఆర్ గాయం గురించి తెలిసి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఆయన అనుచరులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేటీఆర్ గాయం గురించి తెలిసిన వెంటనే మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు.