×
Ad

New Year Celebrations: మందుబాబులకు కిక్కే కిక్కు.. అర్థరాత్రి వరకు లిక్కర్ అమ్మకాలు..

రాష్ట్రవ్యాప్తంగా 20 చెక్‌పోస్టుల్లో, రైళ్లు, వాహనాల్లో అక్రమ మద్యం రవాణపై నిఘా ఉంచుతామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు.

New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందుబాబులకు ఇది కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పాలి. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31న మద్యం షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచేందుకు ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇక బార్లు, క్లబ్ లు, పర్మిషన్ గల ఈవెంట్స్, టూరిజం ప్రాంతాల్లో అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు వీలు కల్పించింది.

ఈ మేరకు.. న్యూ ఇయర్ వేడుకలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. డిసెంబర్ 31న మద్యం షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు అమ్మకాలు నిర్వహించుకోవచ్చని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ ఉత్తర్వులు ఇచ్చారు. అటు బయటి రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం రవాణపై నిఘా పెట్టామని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. గంజాయి, డ్రగ్స్, నాటుసారాలపై స్పెషల్ టీమ్స్ తో దాడులు జరుపుతామంది.

మరోవైపు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించింది. డిసెంబర్ 27 నుంచి 29 వరకు ఎన్‌డీపీఎల్, ఎన్‌డీపీఎస్‌లపై ప్రత్యేక దాడులు చేసింది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, గంజాయి, డ్రగ్స్‌పై తనిఖీలు చేసింది. వరంగల్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఐడీ లిక్కర్ (నాటుసారా)పై దాడులు చేసింది.

డిసెంబర్ 30, 31న ప్రత్యేక ఈవెంట్లు ఉండనున్న నేపథ్యంలో వాహన తనిఖీలు ఉంటాయని.. రాష్ట్రవ్యాప్తంగా 20 చెక్‌పోస్టుల్లో, రైళ్లు, వాహనాల్లో అక్రమ మద్యం రవాణపై నిఘా ఉంచుతామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు.

Also Read: డ్రంకెన్ డ్రైవింగ్‌ చేస్తే ఇక అంతే.. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌