Ganesh Bhavan Mahabubnagar
Ganesh Bhavan Mahabubnagar : తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా గణేష్ భవన్‌ను నిర్మించారు. మహబూబ్‌నగర్ లో ఆర్డీవో కార్యాలయం సమీపంలో రూ. 30 లక్షల నిధులతో నిర్మించిన గణేష్ భవన్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం గణేష్ భవన్‌లో ప్రతిష్టించిన బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బుచ్చారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్య యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్, ముడా డైరెక్టర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.