CM KCR Bihar Tour: సైనికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం.. బీహార్ సీఎం నితీశ్‌తో కలిసి చెక్కులు పంపిణీ

సీఎం కేసీఆర్ బీహార్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గల్వాన్ ఘర్షణల్లో అమరులైన 10మంది బీహార్ సైనికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. బీహార్ సీఎ నితీష్ కుమార్ తో కలిసి ఆర్థిక సాయంకు సంబంధించిన చెక్కులను సైనికుల కుటుంబాలకు అందజేశారు.

CM KCR Bihar Tour: సైనికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం.. బీహార్ సీఎం నితీశ్‌తో కలిసి చెక్కులు పంపిణీ

CM KCR

CM KCR Bihar Tour: సీఎం కేసీఆర్ బీహార్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గల్వాన్ ఘర్షణల్లో అమరులైన 10మంది బీహార్ సైనికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. బీహార్ సీఎ నితీష్ కుమార్ తో కలిసి ఆర్థిక సాయంకు సంబంధించిన చెక్కులను సైనికుల కుటుంబాలకు అందజేశారు. బుధవారం బేగంపేట విమానాశ్రయం నుంచి పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్.. నేరుగా బీహార్ సీఎం నితీశ్ కార్యాలయానికి వెళ్లారు.

CM KCR Bihar Tour: నేడు బీహార్ పర్యటనకు సీఎం కేసీఆర్.. నితీష్ కుమార్‌తో భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ

సీఎం కేసీఆర్‌కు బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ లు ఘన స్వాగతం పలికారు. అనంతరం నితీశ్, తేజస్వీ యాదవ్ తో కేసీఆర్ కొద్దిసేపు భేటీ అయ్యారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరపున సైనికుల కుటుంబాలకు నితీశ్ తో కలిసి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి వేల మంది బీహారీలు కృషి చేస్తున్నారని అన్నారు. గాల్వాన్ లో వీర సైనికుల త్యాగం ఎంతో గొప్పదని, అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని కేసీఆర్ అన్నారు.

CM KCR : విద్యుత్ ‪బకాయిలపై సీఎం కేసీఆర్ ఆరా.. సెప్టెంబర్ 1న భవిష్యత్ కార్యాచరణ

అదేవిధంగా కొద్ది నెలల క్రితం సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున కేసీఆర్ ఆర్థిక సాయం అందించనున్నారు.సీఎం కేసీఆర్ బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో భేటీ కానున్నారు. ఈ భేటీలో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలపై కేంద్రం వైఖరిపై వీరిరువురు చర్చించే అవకాశం ఉంది.