CM KCR Bihar Tour: నేడు బీహార్ పర్యటనకు సీఎం కేసీఆర్.. నితీష్ కుమార్‌తో భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ తో భేటీ అవుతారు. వీరి భేటీ జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇరువురు సీఎంలు కేంద్రంలో బీజేపీ తప్పుడు విధానాలను అవలంభిస్తుందని మండిపడుతున్నారు. ఈ క్రమంలో వీరి భేటీలో బీజేపీని గద్దెదింపేందుకు ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

CM KCR Bihar Tour: నేడు బీహార్ పర్యటనకు సీఎం కేసీఆర్.. నితీష్ కుమార్‌తో భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ

Cm Kcr and Cm nithesh Kumar

CM KCR Bihar Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అమరులైన ఐదుగురు సైనిక కుటుంబాలకు చెక్కులను, సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాదంలో మరణించిన బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. అదేవిధంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో కలిసి లంచ్ చేస్తారు. సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న నితీశ్ కుమార్ ఇటీవల కూటమి నుంచి వైదొలగారు. బీహార్ లో బీజేపీని వీడి ఆ రాష్ట్రంలోని ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్డీయే వ్యతిరేక కూటమికోసం నితీష్ ప్రయత్నిస్తున్న క్రమంలో నితీష్, కేసీఆర్ భేటీ జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

CM KCR : విద్యుత్ ‪బకాయిలపై సీఎం కేసీఆర్ ఆరా.. సెప్టెంబర్ 1న భవిష్యత్ కార్యాచరణ

ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఉదయం 10గంటలకు ప్రత్యేక విమానంలో పాట్నాకు వెళ్తారు. గాల్వన్ లోయలో అమరులైన ఐదుగురు బీహార్ సైనికుల కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున ఆర్థిక సహాయం కింద చెక్కులు అందించనున్నారు. అదేవిధంగా తెలంగాణలోని సికింద్రాబాద్ టింబర్ డిపోలో ఇటీవల అగ్ని ప్రమాదంలో 12 మంది బీహార్ వలస కూలీలు మరణించారు. వారి కుటుంబాల వద్దకు వెళ్లి సీఎం కేసీఆర్ రూ. 5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నారు. అయితే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా పాల్గోనున్నారు.

CM KCR: ఎల్లుండి బిహార్‌కు సీఎం కేసీఆర్.. నితీష్ కుమార్‌తో జాతీయ రాజకీయాలపై చర్చ

మధ్యాహ్నం నితీశ్ కుమార్, కేసీఆర్ కలిసి లంచ్ చేస్తారు. అనంతరం కొద్దిసేపు జాతీయ రాజకీయాలపై వారు చర్చించనున్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఇరువురు సీఎంలు తప్పుబడుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలను బీజేపీ కూల్చుతున్న విధానం సరైంది కాదని, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఇప్పటికే ఇరువురు  తీవ్ర స్థాయిలో విమర్శించారు. దీనికితోడు రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుందని కేంద్రంపై విమర్శలు గుప్పించారు.  ఇప్పటికే సీఎం కేసీఆర్ దేశంలో తృతీయ కూటమికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నితీశ్ కుమార్ సైతం ఇటీవల ఎన్డీయే కూటమిని వీడిన విషయం విధితమే. ఈ పరిస్థితుల్లో ఇరువురు సీఎంల భేటీపై జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది.