CM KCR : విద్యుత్ బకాయిలపై సీఎం కేసీఆర్ ఆరా.. సెప్టెంబర్ 1న భవిష్యత్ కార్యాచరణ
తెలంగాణ విద్యుత్ శాఖకు రావాల్సిన బకాయిలపై సెప్టెంబర్ 1న మరోసారి సమీక్షించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అదే రోజు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిద్దామన్నారు. 5 గంటలకుపైగా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించిన కేసీఆర్.. విద్యుత్ శాఖ బకాయిలపై ట్రాన్స్ కో సీఎండీ, డిస్కమ్ అధికారులతో కేసీఆర్ చర్చించారు.

CM KCR : తెలంగాణ విద్యుత్ శాఖకు రావాల్సిన బకాయిలపై సెప్టెంబర్ 1న మరోసారి సమీక్షించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అదే రోజు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిద్దామన్నారు. 5 గంటలకుపైగా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించిన కేసీఆర్.. విద్యుత్ శాఖ బకాయిలపై ట్రాన్స్ కో సీఎండీ, డిస్కమ్ అధికారులతో కేసీఆర్ చర్చించారు.
ఏపీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై కేంద్రం ఇచ్చిన ఆదేశాలు, ఏపీ నుంచి రావాల్సిన బిల్లులపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించారు. కేంద్రం ఆదేశాలపై ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏపీ నుంచి రావాల్సిన బకాయిలపై కేంద్రానికి లేఖ రాయాలా? ఏం చేయాలి? అనేదానిపై సీఎం కేసీఆర్ రివ్యూ చేశారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కరెంట్ బకాయిల వివాదం రాజుకుంది. తెలంగాణ వర్సెస్ సెంటర్ వయా ఏపీగా మారింది. ఏపీ జెన్‌కోకు బకాయిలు వడ్డీతో కలిపి చెల్లించాలని తెలంగాణ విద్యుత్ సంస్థలకు కేంద్రం ఆదేశించడం దుమారం రేపింది. మొత్తం రూ.6వేల 756 కోట్లు నెల రోజుల్లో చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం డెడ్ లైన్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
రూ.3వేల 441 కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు రూ.3వేల 315 కోట్ల లేట్ పేమెంట్ కూడా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. విభజన తర్వాత 2014 నుంచి 2017 వరకు తెలంగాణ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసినందుకు ఏపీకి తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది.
తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలపై ఏపీ ప్రభుత్వం అనేకమార్లు వినతిపత్రాలు సమర్పించింది. ఇటీవల ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేశారు. దీంతో కేంద్ర విద్యుత్ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. విభజన చట్టం రూల్స్ ప్రకారం కేంద్రం ఆదేశాలతో ఏపీ జెన్‌కో తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసింది.
రూ.6వేల 756 కోట్లు ఏపీకి కట్టాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం ఫైర్ అయ్యింది. ఈ వ్యవహారంలో తెలంగాణ వాదన మరోలా ఉంది. ఏపీ ప్రభుత్వమే తెలంగాణకు రూ.12వేల కోట్లు చెల్లించాలని ఎదురుదాడికి దిగింది. విభజనకు ముందు కర్నూలు, అనంతపురం జిల్లాలు తెలంగాణ సెంట్రల్ పవర్ సిస్టమ్ పరిధిలో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో విద్యుత్ సరఫరా డెవలప్ మెంట్ కోసం విద్యుత్ సంస్థలు రూ.12వేల 941 కోట్ల రుణాలు తీసుకున్నాయని తెలంగాణ చెబుతోంది. ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సిన బకాయిల కంటే ఇవి ఎక్కువేనని.. ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు బకాయిలు చెల్లించేది లేదని తెగేసి చెబుతోంది.