ఓర్నీ.. ఇదేం పాడుపనిరా సామీ.. ముందు దేవుడు పటాలు.. వాటి వెనకాల చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ఒడిస్సా నుంచి గంజాయిని తీసుకొచ్చి రోహన్ సింగ్ అనే వ్యక్తి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు అతని ఇంట్లో తనిఖీలు చేశారు.

ganja

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గంజాయి దందా యథేచ్చగా కొనసాగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా కేటుగాళ్లు గంజాయిని పట్టణాలకు తరలిస్తూ విక్రయాలు చేస్తున్నారు. పలు దఫాలుగా పోలీసులు దాడులు చేసి పెద్దెత్తున గంజాయి నిల్వలను స్వాధీనం చేసుకొని.. సరఫరా దారులపై కఠిన చర్యలు తీసుకున్నా గంజాయి రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. ఇటీవల కాలంలో గంజాయి స్మగ్లింగ్ కొత్త పందాలో కొనసాగుతుంది. ఇలాంటి తరహా ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Also Read: బంపర్ ఆఫర్.. పిల్లలను కంటే డబ్బులే డబ్బులు..! రెండో బిడ్డకు రూ.6లక్షలు.. మూడో బిడ్డకు రూ.12లక్షలు..

దూల్‌పేట గంజాయి స్మిగ్లంగ్ కొత్త పందాలో కొనసాగుతుంది. ఒడిస్సా నుంచి గంజాయిని తీసుకొచ్చి రోహన్ సింగ్ అనే వ్యక్తి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు అతని ఇంట్లో తనిఖీలు చేశారు. ఇంట్లో సోదాలు చేస్తుంటే రోహన్ సింగ్ ఇంట్లో పూజలు చేస్తుండటంపై ఎక్సైజ్ అధికారులకు అనుమానం వచ్చింది. రోహన్ సింగ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అసలు విషయం బయటకొచ్చింది. దేవుడు పటాలను తీసి చూడగా.. వాటి వెనుక గంజాయిని గుర్తించారు. దేవుడు ఫొటోల వెనుక గంజాయినిదాచి.. దేవుడికి భక్తితో పూజలు చేస్తున్నట్లుగా రోహన్ సింగ్ డ్రామా ఆడారు.

ఒరిస్సా నుంచి గంజాయిని తీసుకొచ్చి దేవుడి చిత్రపటాల వెనుక పెట్టి అమ్మకాలు చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. దూల్‌పేట నుంచి గచ్చిబౌలి వరకు గంజాయిని తీసుకువెళ్లి అమ్ముతున్నాడని గుర్తించిన పోలీసులు.. అతన్ని అరెస్టు చేసి.. 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠా ఒడిశా నుండి గంజాయిని తీసుకువచ్చి 5, 10, 15, మరియు 20 గ్రాముల చిన్న ప్యాకెట్లలో గచ్చిబౌలి, మాదాపూర్, ఇతర ఐటీ ప్రాంతాలలోని ఏజెంట్లకు రిటైల్ అమ్మకంకోసం పంపిణీ చేసినట్లు దర్యాప్తులో తేలింది.